మాతృభాషను మరువొద్దు

ABN , First Publish Date - 2022-02-22T06:36:58+05:30 IST

మాతృభాషను విద్యార్థులు మరువొద్దని మేళ్లచెర్వు ఎంఈవో సైదానాయక్‌ అన్నారు. జిల్లాలోని పలు పాఠశాలలో సోమవారం మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు.

మాతృభాషను మరువొద్దు
మేళ్లచెర్వు ప్రాథమికోన్నత పాఠశాలలో వివిధ వేషధారణల్లో విద్యార్థులు

మేళ్లచెర్వు/గరిడేపల్లి/కోదాడ, ఫిబ్రవరి 21: మాతృభాషను విద్యార్థులు మరువొద్దని మేళ్లచెర్వు ఎంఈవో సైదానాయక్‌ అన్నారు. జిల్లాలోని పలు  పాఠశాలలో సోమవారం మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. మేళ్లచెర్వు  ప్రాథమికోన్నత పాఠశా లలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంఈవో హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత మాతృభాషతోనే వెలుగులోకి వస్తుంద న్నారు. పాఠశాలలో 100 రోజుల రీడ్‌ ఎంజాయ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అనంతరం గ్రంథా లయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి హరిత, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గరిడేపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు చిత్రలేఖనం, పాటలు, ఉపన్యాస పోటీ లను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నగేష్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సంద ర్భంగా కోదాడలోని సాయి వికాస డిగ్రీ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళా శాలలో విద్యార్థులకు వ్యాసరచనలు, క్విజ్‌ పోటీలు నిర్వహిం చారు.  అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గంగాధర్‌, జీఎస్‌ఎన్‌ రెడ్డి, బాషా, ప్రసాద్‌, ఎం.సైదయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-22T06:36:58+05:30 IST