Abn logo
Sep 23 2020 @ 02:03AM

హిందీ తెలియకపోతే రుణం ఇవ్వను

Kaakateeya

విశ్రాంత వైద్యుడికి బ్యాంక్‌ మేనేజర్‌ ఝలక్‌

బదిలీ వేటు వేసిన అధికారులు


చెన్నై, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): హిందీ భాష తెలిస్తేనే బ్యాంక్‌ రుణమిస్తామన్న బ్యాంక్‌ మేనేజర్‌పై బదిలీ వేటు పడింది. తమిళనాడులోని అరియలూరు జిల్లా యుద్ధపల్లం గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ డాక్టర్‌ స్రుబమణియన్‌ (65) షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు చోళపురంలోని ఓ జాతీయ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ విషయమై బ్యాంక్‌ మేనేజర్‌ విశాల్‌ నారయణన్‌ కాంబ్లేను సంప్రతించినప్పుడు ‘మీకు హిందీ వచ్చా?’ అని ప్రశ్నించారు. తనకు తమిళం, ఆంగ్లం మాత్రమే తెలుసని హిందీరాదని సుబ్రమణియన్‌ తెలిపారు. దీనితో హిందీ తెలిస్తేనే రుణమిస్తానని, లేకుంటే ఇవ్వనని మేనేజర్‌ ఖరాకండిగా తెలిపారు.


దీనితో సుబ్రమణియన్‌ ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులకు వివరించారు. న్యా యవాది ద్వారా పంపిన నోటీసులకు మేనేజర్‌ బదులివ్వలేదని తెలిపారు. ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో రావడంతో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రకటన విడుదల చేశారు. హిందీ భాష తెలిస్తేనే రు ణమిస్తానని చెప్పిన బ్యాంక్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనితో నిర్వాహకులు మేనేజర్‌ను రీజనల్‌ ఆఫీసుకు బదిలీ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement