Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాసంగిలో వరి పంట వేయొద్దు

ఖరీఫ్‌ధాన్యం కొనుగోళ్లు వేగవంతం 

మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు 

రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి 

జిల్లాలో 80 శాతం మొదటిడోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి 

నేటి నుంచి పకడ్బందీగా రెండోడోస్‌ వ్యాకి ్సన్‌

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : యాసంగిలో రైతులు వరిపంటను సాగుచేయవద్దని ప్రత్యామ్నాయ పంటలసాగుకే ప్రాధాన్యాతనివ్వాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ రైతులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌సీఐ బాయిల్డ్‌రైస్‌ కొనుగోలు చేయకపోతున్న కారణంగా రైతులు ధాన్యం సాగును విరమించుకోవాలన్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు వరి పం టకు బదులు స్థానికంగా డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఒకవేళ రైతులు తమసొంత అవసరాల కోసం స్వల్పంగా మాత్రమే వరిని సాగుచేయాలే తప్ప అమ్ముకునేందుకు మాత్రం సాగుచేయవద్దని పేర్కొన్నారు. ఖరీఫ్‌ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నా యని చెప్పారు. జిల్లాలో ఖరీఫ్‌ధాన్యం కొనుగోలు కోసం 186 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1 లక్ష 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 49 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించామన్నారు. కాగ పొరుగు రాష్ర్టాల నుండి జిల్లాలోకి అక్కడి ధాన్యం తరలిరాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే బాసర, బెల్‌తరోడా సారంగా పూర్‌ మండలంలోని సిర్‌పెల్లి వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామ న్నారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్‌శాఖలతో  కలిసి ఉమ్మడి నిఘాను చేపడుతున్నట్లు వెల్లడించారు. 

నేటి నుంచి  పకడ్బందీగా వ్యాక్సినేషన్‌

జిల్లాలోఇప్పటి వరకు 80 శాతం మొదటిడోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, రెండోడోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు బుధవారం నుండి స్పెషల్‌డ్రైవ్‌  నిర్వహిస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోకుండా జిల్లాలోకి వచ్చే ఇతర రాష్ర్టా ల వారిపై దృష్టి సారిస్తున్నామని దీనికోసం గాను సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, పి. రాంబాబు,  జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీకళ, డీఎస్‌వో అనురాధ, తదితరులు పాల్గొన్నారు. 

ముప్పై పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

నర్సాపూర్‌(జి) : మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేశారు. యంపీడీవో ఉషారాణికి జనాభా లెక్కలు అడిగారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వీణకు తగిన సూచనలు, సల హాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీయంహెవో ధన్‌రాజ్‌, యంపీవో శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ము త్యం, గిర్దావర్‌ వేణుగోపాల్‌, ఉప సర్పంచ్‌ సాయేందర్‌, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

కుభీర్‌ : మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో కలెక్టర్‌ ము షారఫ్‌ అలీ ఫారూఖీ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించి కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. 

స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకురండి

నిర్మల్‌ కల్చరల్‌ : స్వచ్ఛందంగా రక్తదానానికి ప్రజలు ముందుకువచ్చి ప్రా ణదాతలు కావాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పిలుపునిచ్చారు. మంగళ వారం డిపో ఆవరణలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదా న శిబిరంలో ఆయన పాల్గొన్నారు శిబిరంలో ఆర్‌ఎం ఆంజనేయులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు సాయన్న, నాయుడి రమేష్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 


Advertisement
Advertisement