కరోనాపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2021-04-14T05:22:06+05:30 IST

కరోనాపై నిర్లక్ష్యం వద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఎస్పీ అమిత్‌బర్దర్‌ స్పష్టం చేశారు.

కరోనాపై నిర్లక్ష్యం వద్దు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్

 అప్రమత్తంగా ఉండాల్సిందే ఫ నో మాస్కు- నోఎంట్రీ బోర్డులు పెట్టండి ఫ ఎస్పీ అమిత్‌బర్దర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 13:  కరోనాపై నిర్లక్ష్యం వద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఎస్పీ అమిత్‌బర్దర్‌  స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మంగళవారం రాత్రి నగరంలోని వివిధ జం క్షన్ల వద్ద ఎస్పీ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మాస్కు ధరించని వారిని, అజాగ్ర త్తగా ఉన్నవారిని పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. జిల్లాలో కరోనా రెండో దశ వ్యాప్తి ఎక్కువగా ఉందని, కేసులు భారీసంఖ్యలో పెరుగుతున్నాయని తెలిపారు.  ప్రతీ దుకాణం, వీధి, వార్డుల్లో నోమాస్కు-నోఎంట్రీ బోర్డులను ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.   కార్యక్ర మంలో  డీఎస్పీలు మహేంద్ర, ప్రసాదరావు పాల్గొన్నారు. 

 అవగాహన కల్పించండి 

పోలాకి: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలని మండల ప్రత్యేకాధికారి గోపాల కృష్ణమూర్తి, ఎంపీడీవో రాధాకృష్ణ కోరారు.  మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయుతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష  సమావేశం నిర్వహించారు. జ్వరపీడితులను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని, కరోనా అనుమానం వస్తే తక్షణం వైద్య పరీక్షలు, అలాగే 45 ఏళ్లు దాటిన వారిని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించాలని కోరారు.  దుకాణాల్లో వ్యాపారులు, అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు కొనుగోలుదారులు మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. మాస్క్‌ లేనిదే బయటకు రావద్దని సూచించాలన్నారు.  సమావేశంలో ఎస్‌ఐ సీహెచ్‌ చిన్నంనాయుడు,  సిబ్బంది పాల్గొన్నారు. 

నిబంధనలు పాటించకుంటే దుకాణాల మూసివేత

ఎల్‌.ఎన్‌.పేట: కరోనా వైరస్‌ ఉధృతంగా వ్యాపి ్తచెందుతున్నందున వ్యాపారులు ప్రభుత్వం విఽధంచే కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, లేకుంటే దుకాణాలు మూసివేస్తామని తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ హెచ్చరించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మండల కేంద్రంలోని వ్యాపారులతో  మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున వ్యాపారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీటీ  రషీద్‌అహమ్మద్‌, వీఆర్వో వి. రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. గార: ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని మండల ప్రత్యేక అధికారి గుత్తు రాజారావు పేర్కొన్నారు. మంగళవారం శాలిహుండం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల న్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

టీకాను వినియోగించుకోండి

టెక్కలి రూరల్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని, 45 ఏళ్లు నిండిన  ప్రతీ ఒక్కరూ  వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి డా.మంచు కరుణాకరరావు అన్నారు. మంగళవారం  లింగావలస గ్రామ సచివాలయంలో  వాక్సిన్‌పై అవగాహన కలిగించారు. గ్రామ సచివాలయం పరిధిలో 1,011 మంది 45 ఏళ్లు దాటినవారున్నారని, వారందరు వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కోరారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, ఉపసర్పంచ్‌ ఉమాపతి, సచివాలయం సెక్రటరీ సుమలత, తదితరులు పాల్గొన్నారు. 

మాస్కు ధరించకపోతే జరిమానా 

పాలకొండ: మాస్క్‌ ధరించకపోతే జరిమానా చెల్లించాలని ఎస్‌ఐ సీహెచ్‌ ప్రసాద్‌, నగర పంచాయతీ కమిషనర్‌ ఎన్‌.రామారావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్‌, వీరఘట్టం, ఏలాం జంక్షన్‌, ఆర్టీసీకాంప్లెక్స్‌ పరిసరాల్లో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్‌ చేశారు. మాస్క్‌ ఆవశ్యకతను వివరించి ధరించని వారి నుంచి అపరాధ రుసుం విధించారు. కరోనా సెకెండ్‌వేవ్‌ ఉఽధృ త్తంగా ఉన్న నేపధ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్‌ ధరించాలని తెలిపారు.

  నలుగురు విద్యార్థులకు కరోనా 

కవిటి: మండలంలో నలుగురి విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధా రించినట్లు తహసీల్దార్‌ ఆర్‌.అప్పలరాజు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. కరోనా బాధితులకు  హోంఐసోలేషన్‌లో ఉంచి  సేవలందిస్తున్నట్లు తెలిపారు. 


 



Updated Date - 2021-04-14T05:22:06+05:30 IST