Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధిక మొత్తంలో పురుగు మందులు వాడొద్దు

చింతలపాలెం, డిసెంబరు1: మిరప తోటల్లో అధిక మొత్తంలో పురుగు మందులు వాడొద్దని  ఐఐహెచ్‌ఆర్‌ బెంగళూరు ప్రఽధాన శాస్త్రవేత్త మాధ విరెడ్డి అన్నారు. మిర్చి పం టను నల్లి, తామర పురు గులు ఆశించి పూత, కాయ తగ్గినందున బెంగ ళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టిక ల్చర్‌ రీసెర్చ్‌ (ఐఐఎచ్‌ఆర్‌), హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవన శాఖకు చెందిన శాస్త్రవేత్తల బృందం దొండపాడు గ్రామంలోని మిరప తోటలను బుధవారం పరిశీలించి రైతులకు అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడారు. గత ఏడాదే తామర పురుగు మిరప తోటల్లో కనిపించిందని, దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నా యని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. పురుగు మందులు వాడకుండా  మొక్కలకు బలం చేకూర్చే  మైక్రో న్యూట్రిన్స్‌ను పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేతలు శ్రీధర్‌, కృష్ణారెడ్డి, రాజ్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌, మర్‌, అనిత, జిల్లా  ఉద్యానవన శాఖ అధికారి  శ్రీధర్‌, అనితారెడ్డి పాల్గొన్నార
Advertisement
Advertisement