వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

ABN , First Publish Date - 2021-01-21T04:48:17+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలకు గురికాకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు.

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు
వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పద్మనాభం, జనవరి 20: కరోనా వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలకు గురికాకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని వెంకటాపురం సచివాలయంలో రేవిడి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య సిబ్బందికి నిర్వహించిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వందమంది సిబ్బందికి స్లాట్‌ ఇవ్వగా 94 మందికి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అయినాడకు చెందిన ఆశ కార్యకర్త కళావతికి వ్యాక్సిన్‌ వేయించుకున్నాక కళ్లు తిరిగినట్టు అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ‘భీమిలి‘ ఇన్‌చార్జి ఎం.మహేశ్‌, మండల ప్రత్యేకాధికారి కె.రాజేశ్వరి, ఎంపీడీవో జీవీ చిట్టిరాజు, తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, రేవిడి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సమత, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T04:48:17+05:30 IST