యాసంగిలో వరి వద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-26T05:33:20+05:30 IST

యాసంగి 2021-22 కాలానికి గాను వరి పంట వేయవద్దని, ఎఫ్‌సీఐ దానిని కొనడం జరగదని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..

యాసంగిలో వరి వద్దు : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, అక్టోబరు 25 : యాసంగి 2021-22 కాలానికి గాను వరి పంట వేయవద్దని, ఎఫ్‌సీఐ దానిని కొనడం జరగదని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. యాసంగిలో వరి పంట వేయకుండా వరికి బదులుగా శనగలు, ఆవాలు, నువ్వు లు, కందులు, వేరుశనగ పంటలు పండించాలని తెలిపారు. అందుకుగాను రైతు లు ఈ నెల 27 నుంచి 29 వరకు రైతు వేదికల్లో రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.  ఇందులో వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌ కుమార్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

నవంబరు 1నాటికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి 

నవంబరు 1 నాటికి జిల్లాలో సంపూర్ణ వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా కలెక్టర్‌ సమావేశం హాల్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలపై నిర్వ హించిన సమావేశంలో కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్య సిబ్బంది డీఆర్డీవోల నుంచి రేషన్‌ కార్డు దారుల, ఆసరా పింఛన్‌దారుల జాబితాను తీసుకొని వ్యాక్సినేషన్‌ ఎంత మందికి పూర్తయ్యింది, వ్యాక్సినేషన్‌ తీసు కోని వారు ఎంత మంది ఉన్నారని పరిశీలించి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి విస్తృ తంగా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 81 శాతంపైగా వ్యాక్సి నేషన్‌ పూర్తయ్యిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

పోడు భూములపై సమగ్ర నివేదిక అందజేయాలి 

పోడు భూములపై అటవీ అధికారులు శనివారంలోపు సమగ్ర నివేదిక రూపొందించి తహసీల్దార్లకు అందజేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ఆదేశిం చారు. సోమవారం కలెక్టర్‌ సమావేశం హాల్‌లో పోడు భూముల సమస్య పరి ష్కారం కోసం చేపట్టనున్న చర్యలపై అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖల అధి కారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్లు, ఎఫ్‌ఆర్‌వోలు అంద జేసిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను వారంలోగా సిద్ధం చేయా లన్నారు. జిల్లాలో ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ కింద పట్టాలు ఇచ్చిన భూములనే సాగు చేస్తు న్నారా? మరింత అటవీ భూమిని కలుపుకున్నారా? అనే అంశాన్ని గుర్తించాల న్నారు. గతంలో పట్టాలు అందని ఎంత మంది అటవీ భూమిని ఆక్రమించుకొని పోడు వ్యవసాయం చేస్తున్నారు? అనే అంశాలను అటవీ అధికారులు గుర్తించాలని స్పష్టం చేశారు.  కాగా, జిల్లాలో 6200 మంది అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించామన్నారు.  

ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పోస్టర్‌ విడుదల

నిర్మల్‌ కల్చరల్‌: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు నిర్వహించే ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2021 వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సోమవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనల ఆవిష్కరణకు ఈ పోటీలు దోహదం చేస్తాయని కలెక్టర్‌ అన్నారు. 

Updated Date - 2021-10-26T05:33:20+05:30 IST