లెక్క తేలేనా?

ABN , First Publish Date - 2021-06-19T05:37:53+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ మూతబడ్డాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఏడాది విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య కొలిక్కి రాలేదు. బడి బయ ట ఎందరు ఉన్నారు? బడి లోపల ఎందరు ఉన్నారు? అన్న లెక్క తేలలేదు.

లెక్క తేలేనా?
గత ఏడాది బడి బయటి పిల్లల గుర్తింపు సర్వేలో పాల్గొన్న సీఆర్‌పీలు

బడి బయటి విద్యార్థుల గుర్తింపులో విద్యాశాఖ నిమగ్నం

కరోనా వల్ల ఏడాదిన్నరగా మూతపడ్డ పాఠశాలలు

పాఠశాలలు నడిచిన సమయంలోనే అంతంతమాత్రంగా బడి బయటి విద్యార్థుల గుర్తింపు

ఉమ్మడి జిల్లాలో 2వేల మంది ఉన్నట్టు అంచనా

మరోవైపు విద్యార్థుల గుర్తింపులోనూ గందరగోళమే!

బోధన్‌, జూన్‌ 18: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ మూతబడ్డాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఏడాది విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య కొలిక్కి రాలేదు. బడి బయ ట ఎందరు ఉన్నారు? బడి లోపల ఎందరు ఉన్నారు? అన్న లెక్క తేలలేదు. గత ఏడాది విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు కే వలం నెల రోజుల పాటు మాత్రమే ప్రత్యక్షంగా తరగతులు జరిగాయి. ఆ తర్వాత కరోనా ప్రభావంతో విద్యార్థులు పూర్తిగా పాఠశాలలకు రాలేదు. అర కొరగా వచ్చిన విద్యార్థులతో పాఠశాలలు నెల రోజుల పాటు కొనసాగినా.. వచ్చిన విద్యార్థులేవరో? పాఠశాలలకురాని విద్యార్థులెవరో? కొలిక్కిరాలేదు. ఇక నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులైతే లెక్కే లేదు. వారికి ఏడాదిన్నర కాలంగా బడులను చూసే అదృష్టమే దక్కకపోవడంతో వారు ఏ పాఠశాల విద్యార్థులో లెక్క తేల్చే పరిస్థితులు కూడా లేవు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యా శాఖ మళ్లీ బడి బాట పట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆన్‌లైన్‌ క్లాసులే అయినా విద్యాశాఖకు మాత్రం బడిబా ట పట్టడం తప్పడం లేదు. 

గందరగోళంగా బటిబాట వ్యవహారం

గత ఏడాది విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ తరగతులు తప్ప పాఠశాలలు ప్రారంభం కాకపోయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం బడిబాట కొన సాగించారు. మళ్లీ ఈ ఏడాది సైతం విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నా బడిబాట తప్పేలా లేదు. దీంతో బడిబాట వ్యవహారంలో గందరగోళం నెల కొంది. విద్యార్థులు గ్రామాలలో ఇళ్లకు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు తమ ఆధార్‌కార్డులు అందజేస్తుండడంతో ప్రభుత్వ ఉపాఽధ్యాయులు విద్యా ర్థుల పేర్లను తమ పాఠశాలలో ఆన్‌లైన్‌ లెక్కల్లో చూపుతున్నారు. ఈ విష యం తెలియకుండానే తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యార్థుల ఆధార్‌కార్డులను అందజేస్తున్నారు. అప్పటికే ఆ విద్యార్థులు ఏదో ఒక ప్రైవే టు పాఠశాలలోనో, గురుకుల పాఠశాలలోనో తమ పేర్లను నమోదు చేసుకొ ని ఉంటున్నారు. కానీ, విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండడంతో బడిబాటకు వెళ్లిన ఉపాధ్యాయులు తమ సంఖ్యను పెంచుకునేందుకు విద్యార్థుల ఆధార్‌కార్డు లతో వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండడం గందరగోళానికి తెరలే పుతోంది. ఒకే విద్యార్థి పేరు ఒకటి రెండు పాఠశాల్లో నమోదై ఉండడం వి ద్యార్థుల లెక్క తప్పేలా చేస్తోంది. దీంతో యూ డైస్‌లో విద్యార్థుల లెక్క త ప్పటడుగులు వేస్తోంది. 

చదువులకు దూరమైన పలువురు విద్యార్థులు

ఆర్థిక అవసరాలు, ఇతర కారణాలతో గత విద్యా సంవత్సరంలో జిల్లాలో ని పలువురు విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. వారిని తిరిగి బడు ల్లో చేర్చేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రా రంభం కానున్న నేపథ్యంలో బడిబయట పిల్లలను బడిలో చేర్చేందుకు వి ద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో 1,500 నుంచి 2వేల వరకు విద్యార్థులు చదువులకు దూర ంగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 6 నుంచి 14యేళ్ల లోపు బడిఈడు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. వీరందరినీ బడిలో చేర్చడమే లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 

ప్రతియేటా ఇదే పరిస్థితి

గత ఏడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా బడిబయట విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నా.. ప్రతియేటా ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. సంచార జాతులు, వలస కార్మికుల పిల్లలు, ఆర్థిక ఇక్కట్లతో అనేక మంది తల్లిదం డ్రులు పిల్లలను ఇళ్లకే పరిమితం చేస్తుండడంతో జిల్లాలో బడి బయట పిల్ల ల సంఖ్య పెరుగుతోందని విద్యాశాఖ సర్వేలు చెబుతున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఈనెల 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అందరినీ చదువులకు దగ్గర చేయాలన్న సంకల్పంతో విద్యాశాఖ బడిబయ ట పిల్లలను గుర్తించేందుకు పకడ్బందీగా కసరత్తు మొదలుపెట్టింది. చదు వులకు దూరమైన విద్యార్థుల వివరాలను విద్యా శాఖకు సంబంఽధించిన చై ల్డ్‌ ఇన్‌ఫో పోర్టల్‌లో నమోదు చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు మొదలుపె ట్టింది. జిల్లాలోని పాఠశాలల సముదాయాల వారీగా సర్వేకు ఏర్పాట్లు మొ దలవుతున్నాయి. ఈ వివరాల ఆధారంగా తిరిగి విద్యార్థులను సర్కారు బ డులు, కేజీబీవీలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని పాఠశాలల సముదాయాల ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు, ఎంఈవోలు ఈ సర్వేలో కీలకంగా మారనున్నారు. 

Updated Date - 2021-06-19T05:37:53+05:30 IST