Viral Video: సింహాలే గుంపులుగా వస్తాయ్.. కానీ ఈ జింక సింగల్‌గానే... చుక్కలు చూపించింది..

ABN , First Publish Date - 2022-02-10T02:38:05+05:30 IST

పదుల సంఖ్యలో సింహాలు దాడి చేసేందుకు వచ్చినా.. ఏమాత్రం భయపడకుండా సింహాలకే చుక్కలు చూపించింది ఓ జింక. ఈ జింక ధైర్యానికి సింహాలన్నీ తోక ముడిచాయి. ఈ వీడియో ప్రస్తుతం..

Viral Video: సింహాలే గుంపులుగా వస్తాయ్.. కానీ ఈ జింక సింగల్‌గానే... చుక్కలు చూపించింది..

పందులే గుంపులుగా వస్తాయి.. కానీ సింహం సింగల్‌గా వస్తుంది!.. ఇది సినిమా డైలాగ్. కానీ సింహాలే గుంపులుగా వస్తాయి.. జింక సింగల్‌గానే పోరాడుతుంది.. అనేది రియల్ డైలాగ్. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. పదుల సంఖ్యలో సింహాలు దాడి చేసేందుకు వచ్చినా.. ఏమాత్రం భయపడకుండా సింహాలకే చుక్కలు చూపించింది ఓ జింక. ఈ జింక ధైర్యానికి సింహాలన్నీ తోక ముడిచాయి. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ జింక సరస్సులో నీరు తాగుతూ ఉంటుంది. అప్పుడే సింహాలన్నీ గుంపులుగా అక్కడికి వస్తాయి. ఒంటరిగా జింక దొరికింది.. పండుగ చేసుకుందామనుకుంటూ సమీపానికి వస్తాయి. ఓ సింహం జింక మీదకు అమాంతం దూకేస్తుంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు జింక శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ సింహం మాత్రం దాన్ని మరింత గట్టిగా పట్టుకుంటుంది. ఇక సింహానికి బలైపోతుందనుకున్న క్రమంలో ఒక్కసారిగా సీన్ మారుతుంది. ఎలాగైనా తప్పించుకోవాలనే జింక పట్టుదల ముందు.. సింహం ఓడిపోతుంది. ఒక్కసారిగా దాని నుంచి విడిపించుకుని, కాలితో ఒక తన్ను తన్ని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మిగతా సింహాలన్నీ అలాగే చూస్తూ ఉంటాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

పిచ్చుక మృతితో గ్రామమంతా శోకసంద్రం.. దాని మీద ప్రేమతో ప్రజలంతా ఏం చేశారంటే..





Updated Date - 2022-02-10T02:38:05+05:30 IST