Currency నోట్లను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారో తెలుసా..? పేపర్ అస్సలు కాదండోయ్..!
ABN , First Publish Date - 2022-06-16T01:54:09+05:30 IST
కరెన్సీ నోటు కనపడితే కళ్లకు అద్దుకుని మరీ జేబులో పెట్టుకుంటాం. పర్సులో నోట్లను చూస్తూ సంబరపడతాం. అయితే చాలా మందికి కరెన్సీ నోట్లు దేనితో తయారు చేస్తారో తెలీదు. నోటు..
కరెన్సీ నోటు కనపడితే కళ్లకు అద్దుకుని మరీ జేబులో పెట్టుకుంటాం. పర్సులో నోట్లను చూస్తూ సంబరపడతాం. అయితే చాలా మందికి కరెన్సీ నోట్లు దేనితో తయారు చేస్తారో తెలీదు. నోటు అనగానే కాగితంతో తయారు చేసుంటారని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కాగితంతో తయారు చేసిన నోట్లు త్వరగా చినిగిపోతాయి. ప్రస్తుతం మన దేశంలో రూ.5, రూ.10, రూ.20, రూ.50 మరియు రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక పద్ధతి ద్వారా తయారు చేస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, నోట్ల తయారీలో ప్రధానంగా పత్తిని వినియోగిస్తారు. ఏంటీ! ఆశ్యర్యపోతున్నారా.. అవును 100శాతం పత్తిని ఉపయోగించే నోట్లను తయారు చేస్తారు. మన దేశమే కాకుండా చాలా దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీకి పత్తినే వినియోగిస్తున్నారు. 75 శాతం పత్తి, 25 శాతం నార మిశ్రమాన్ని వినియోగించడంతో పాటూ.. ప్రత్యేక సూత్రాన్ని ఉపయోగించి ఈ నోట్లను తయారు చేస్తారు. ప్రింటింగ్ ప్రక్రియలో పత్తిని జెలటిన్ అనే ద్రావణంతో కలుపుతారు. తద్వారా నోటు ఎక్కుకాలం మన్నేలా చేస్తుంది.
మురుగు నీరు, మూత్రంతో బీరు తయారీ... తాగితే ఎంతో రిలీఫ్ అంటున్న మద్యం ప్రియులు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 22 ప్రకారం.. దేశంలో నోట్లను జారీ చేసే హక్కు రిజర్వ్ బ్యాంక్‌కు మాత్రమే ఉంది. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం.. ఇంకా ఇతర వాటాదారులతో సంప్రదించి, ఒక సంవత్సరంలో డినామినేషన్ ద్వారా అవసరమైన నోట్ల సంఖ్యను అంచనా వేస్తారు. అలాగే నోట్ల రూపకల్పన కూడా ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఇక, ఐరోపాలో కరెన్సీ నోట్ల తయారీ కోసం కాంబర్ నోయిల్ కాటన్ వినియోగిస్తారట. స్పిన్నింగ్‌లో ఈ Comber Noilను వ్యర్థాల కింద పక్కకు తీసేస్తారట. కరెన్సీ నోట్లలో ఉపయోగించే పత్తి, నార, ఇతర పదార్థాల నిష్పత్తిని బ్యాంకులు రహస్యంగా ఉంచుతాయి.