Abn logo
Aug 4 2021 @ 01:19AM

ముందుకురాని చిన్నపిల్లల వైద్యులు

68 పోస్టులకు ఇద్దరే.. మరో ఇద్దరు అంగీకారం..

88 మంది స్టాఫ్‌నర్సులకు పోస్టింగ్‌

మిగిలిన పోస్టులకు మళ్లీ ఎంపిక

అనంతపురం వైద్యం, ఆగస్టు 3: కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిన్నపిల్లల డాక్టర్లు, స్టాఫ్‌నర్సులను కాంట్రాక్టు ప్రాతిపదికన ని యమించుకునేందుకు శ్రీకారం చుట్టారు. మొత్తం 68 చిన్నపిల్లల డాక్టర్లు, 124 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అర్హత మేరకు ఆస్పత్రి వైద్యాధికారులు ఎంపిక జాబితా విడుదల చేసి, వారికి సోమవా రం పోస్టింగ్‌ ఇవ్వడానికి ఆహ్వానించారు. సూపరింటెండెంట్‌ డా క్టర్‌ జగన్నాథం, డీసీహెచఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ విశ్వనాథయ్యతోపాటు పలువురు వైద్యాధికారుల సమక్షంలో సోమవారం కౌన్సెలింగ్‌ చేపట్టారు. 68 చిన్నపిల్లల డాక్టర్ల పోస్టులకు గాను ఇద్దరు మాత్రమే అంగీకారం తెలిపి, పోస్టింగ్‌ ఉత్తర్వులు తీసుకున్నారు. మరో ఇద్దరు అంగీకారం తెలిపి, మళ్లీ ఉత్తర్వులు తీసుకుంటామని వెళ్లిపోయారు. దీనిని బట్టి కరోనా వైద్య సేవలు అందించడానికి చిన్నపిల్లల వైద్యులు విముఖత చూపుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి కారణం సరైన గౌరవవేతనం ఇవ్వకపోవడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 124 స్టాఫ్‌నర్సు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి ఆహ్వానించారు. 88 మంది అభ్యర్థులు అంగీకారం తెలిపి, కౌన్సెలింగ్‌లో పోస్టింగ్‌ ఉత్తర్వులు తీసుకున్నారు. మిగిలిన పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్‌ ఇస్తామని సూపరింటెండెంట్‌ తెలిపారు. ఈ ప్రక్రియ మూడునాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.