దిగుబడిపై అన్నదాతల దిగాలు

ABN , First Publish Date - 2021-10-22T03:47:33+05:30 IST

ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు చివరికి కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. ఓ యేడు నష్టం వచ్చినా మరో యేడు ఆదుకోలేకపోతుందా అనే ధీమాతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక చేతికొచ్చే దశలో పంటలు నీటి పాల వుతుండడంతో చేసేది లేక దిగాలు చెందుతున్నారు.

దిగుబడిపై అన్నదాతల దిగాలు

- అధిక వర్షాలతో పత్తి రైతుల ఆందోళన

- పెట్టుబడులు రాక అప్పుల పాలు

- వరి రైతుల్లో సైతం ఆశలు గల్లంతు

చింతలమానేపల్లి, అక్టోబరు 21: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు చివరికి కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. ఓ యేడు నష్టం వచ్చినా మరో యేడు ఆదుకోలేకపోతుందా అనే ధీమాతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక చేతికొచ్చే దశలో పంటలు నీటి పాల వుతుండడంతో చేసేది లేక దిగాలు చెందుతున్నారు. గతేడాది సైతం ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోగా ఈ ఏడాది కూడా రైతులకు పెట్టిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆందోళన చెందు తున్నారు. 

జిల్లాలో వివిధ రకాల పంటల సాగు.. 

ఈ ఏడాది జిల్లాలో 3,16,303 ఎకరాల్లో పత్తి పంట, 54,611 ఎకరాల్లో వరి పంట, 3,963 ఎకరాల్లో సోయాబీన్‌, 968 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి పంట ఈఏడాది 27,500ఎకరాల్లో వర్షం కారణంగా వివిధ మండ లాల్లో నష్టపోగా గులాబ్‌ తుఫాన్‌ కారణంగా చింతలమానేపల్లి, కౌటాల, దహెగాం, బెజ్జూర్‌ మండలాలతోపాటు ఏజెన్సీ మండ లాల్లో మరికొంత పంటకు నష్టం వాటిల్లింది. అక్కడక్కడా అధి కారులు పంటనష్టంపై సర్వే జరిపి నివేదికలను ఉన్నతాధికా రులకు పంపినా, నష్ట పరిహారం వస్తుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిపంటలు సైతం నేలమట్టం కావ డంతో పంటల దిగుబడులపై రైతన్నల ఆశలు గల్లంతయ్యాయి.

ఎకరాకు 5 కింటాళ్ల దిగుబడి..

అధిక వర్షాల కారణంగా పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట ఎర్రబడి, ఎదుగుదల నిలిచిపోయింది. కొన్నిచోట్ల పంట ఏపుగా పెరిగినా, పత్తి కాయలు నల్లబారి ఉండడంతో పత్తి నాణ్యత లేకుండా పోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాన పత్తి పంట 9-12 కింటాళ్ల దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎకరాన 4-5 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో కనీసం పెట్టిన ఖర్చులు కూడా రాని పరిస్థతి నెలకొంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. ఇప్పటికే దళారుల వద్ద అప్పు చేసి మరీ పంటను సాగుచేసినా దిగుబడి లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది పత్తి క్వింటాలుకు 7వేలపై చిలుకు ధర పలుకుతోంది. 

పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు..

- చౌదరి పెంటయ్య, రైతు

ఈ ఏడాది మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఇప్పటి వరకు సుమారు లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. వర్షాల కారణంగా పత్తిలో ఎదుగుదల లేదు. దీంతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉంది. 

ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని..

- తిరుపతి, రైతు

రెండు మూడేళ్ల నుంచి పంటలు పూర్తిగా చేతికి రాక తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటలు దెబ్బతిన డంతో అప్పుల పాలవుతున్నాం. అధిక వర్షాలతో ఆశించిన స్థాయి లో దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. రైతులను ప్రభుత్వం ఆదుకుని పరిహారం అందజేయాలి.

Updated Date - 2021-10-22T03:47:33+05:30 IST