liquor banతో ఇబ్బంది ఉంటే బీహార్ రావద్దు...సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-28T12:59:59+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు...

liquor banతో ఇబ్బంది ఉంటే బీహార్ రావద్దు...సీఎం సంచలన వ్యాఖ్యలు

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధంతో ఇబ్బంది ఉంటే బీహార్‌ రాష్ట్రానికి రావద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కోరారు.సోమవారం ససారం పట్టణంలో జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ మద్యనిషేధ చట్టానికి మద్ధతుగా ఈ ప్రకటన చేశారు.‘‘ బీహార్ రాష్ట్రాన్ని సందర్శించే వ్యక్తులు కొంచెం మద్యం తీసుకోవడానికి అనుమతిస్తారని కొందరు అంటున్నారు, అయితే ఇది సాధ్యమేనా? మేం వారిని మద్యం తాగడానికి అనుమతిస్తామా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు మద్యం తాగితే బీహార్‌కు రావద్దు... మీరు మద్యం గురించి ఇబ్బందులు పడుతుంటే బీహార్‌కు రావద్దు.. బీహార్‌కు రావాల్సిన అవసరం లేదు’’ అని నితీష్ కుమార్‌ అన్నారు.


బయటి నుంచి వచ్చే సందర్శకులపై మద్య నిషేధాన్ని సడలించే ప్రసక్తే లేదని సీఎం పునరుద్ఘాటించారు.మద్య నిషేధం విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మద్యం తాగితే ఎంతటి విద్యావంతుడు, తెలివితేటలు ఉన్నా అలాంటి వారిని సమర్థులుగా పరిగణించమని సీఎం అన్నారు. ‘‘మద్యం తాగే వ్యక్తులు సమర్థులు కాదు, మందుబాబులు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు’’ అని ఆయన అన్నారు.




Updated Date - 2021-12-28T12:59:59+05:30 IST