ఎంత మంది రైతుల హత్యకు ప్లాన్ చేశారో?: జయాబచ్చన్

ABN , First Publish Date - 2021-12-16T00:07:28+05:30 IST

ఎంత మంది రైతుల హత్యకు ప్లాన్ చేశారో?: జయాబచ్చన్

ఎంత మంది రైతుల హత్యకు ప్లాన్ చేశారో?: జయాబచ్చన్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో రైతులపైకి కారు ఎక్కడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అయితే ఇలా ఎంత మంది రైతుల మరణాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయోనని ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్ అన్నారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్న కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ అజయ్ మిశ్రా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని బుధవారం ఆమె డిమాండ్ చేశారు.


‘‘ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది తర్వాత సంగతి. నైతికతను అనుసరించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి అజయ్ మిశ్రా రాజీనామా చేసి తీరాల్సిందే. రైతుల మరణాల్లో కుట్ర కోణం ఉన్నట్లు సిట్ స్పష్టం చేసింది. ఏమో.. ఇలా ఎంత మంది రైతుల మరణాల్లో ముందస్తు ప్లాన్ ఉందో? కనీసం ఇదైనా బయటపడింది’’ అని జయా బచ్చన్ అన్నారు.


లఖింపూర్‌లో రైతులపైకి ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించారని ఇది కావాలని పన్నిన కుట్ర అని సిట్ పేర్కొంది. ఇందులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. దీంతో అజయ్ మిశ్రాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్షాలు సహా నెటిజెన్లు పెద్ద ఎత్తున ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-16T00:07:28+05:30 IST