Ukraineలో చిక్కుకుపోయిన భారత పౌరులు సరిహద్దులకు వెళ్లవద్దు

ABN , First Publish Date - 2022-02-26T17:44:29+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలటరీ దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం తాజా సలహా జారీ చేసింది....

Ukraineలో చిక్కుకుపోయిన భారత పౌరులు సరిహద్దులకు వెళ్లవద్దు

 భారత రాయబార కార్యాలయం తాజా సలహా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలటరీ దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం తాజా సలహా జారీ చేసింది. ఉక్రెయిన్ దేశంలోని భారతీయ పౌరులందరూ ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని భారత రాయబార కార్యాలయం కోరింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని, పౌరులను స్వదేశానికి తరలించేందుకు పొరుగుదేశాలతో భారతీయ రాయబార కార్యాలయం నిరంతరం యత్నిస్తుందని అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ దేశంలోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.హంగేరీ, రొమేనియా, పోలాండ్‌లకు భారతీయ విద్యార్థులను తరలించి అక్కడి నుంచి న్యూఢిల్లీకి తీసుకువచ్చేందుకు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీ పట్టణాల్లో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేశారు.


 ఉక్రెయిన్ నుంచి తమ జాతీయుల నిష్క్రమణను సమన్వయం చేయడానికి భారతదేశం హంగేరీలోని జహోనీ సరిహద్దు పోస్ట్, క్రాకోవిక్, పోలాండ్‌లోని షెహిని-మెడికా ల్యాండ్ సరిహద్దు పాయింట్లు, స్లోవాక్ రిపబ్లిక్‌లోని వైస్నే నెమెకే, రొమేనియాలోని సుసెవా ట్రాన్సిట్ పాయింట్‌లలో అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది.ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న భారతీయులు ప్రస్తుతం వారుంటున్న నివాస స్థలాల్లోనే ఉండాలని వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలనీ లేదా షెల్టర్‌లలో ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది.


Updated Date - 2022-02-26T17:44:29+05:30 IST