అత్యాశకు పోయి మోసాలకు గురి కాకండి

ABN , First Publish Date - 2020-02-23T07:05:20+05:30 IST

ప్రజలు అత్యాశకు పోయి మోసాలకు గురి కావద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి శనివారం ఒక ప్రకటనలో

అత్యాశకు పోయి మోసాలకు గురి కాకండి

ఆఫర్‌లు, స్కీములను నమ్మొద్దు

ఎవరైనా అలా చేస్తే మాకు  సమాచారం ఇవ్వండి

కామారెడ్డిఎస్పీ శ్వేతారెడ్డి పిలుపు


కామారెడ్డి, ఫిబ్రవరి22: ప్రజలు అత్యాశకు పోయి మోసాలకు గురి కావద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో కష్టపడుతూ సంపాదిస్తున్నటువంటి సొమ్ము నుంచి పిల్లల చదువు కోసం, ఆడపిల్లల పెళ్లిళ్లకు మరేదో రకంగా అవసరం పడుతుందనే ఉద్దేశంతో ప్రజలు కొం త డబ్బును చిట్‌ఫండ్‌, చిట్టీలు, స్కీమ్‌ల ద్వారా జమ చేస్తున్నారన్నారు. రిజిస్ర్టేషన్‌ లేని, గుర్తింపు పొందని చిట్‌ఫండ్‌, చిట్టీలు, భారీ స్కీమ్‌లు, లక్కీ డ్రాలు, బంఫ ర్‌ ఆపర్ల పేరిట కరపత్రాలకు, ప్రకటనలకు మోసపోవ ద్దని తెలిపారు. ప్రజలకు ప్రకటనలు చూపిస్తూ నమ్మ బలికి మాటలను చెబుతున్నారని జిల్లా కేంద్రంలో ప లు చిట్‌ఫండ్‌లు, స్కీమ్‌లు, చిట్టీలు గుర్తింపు లేకుండా నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చాయని అత్యాశకు పో యి మోసాలకు గురి కావద్దని ఎస్పీ తెలిపారు. 2,250 చెల్లిస్తే 32 లక్షలకు పైబడి ఇంట్లో కూర్చొని సంపాది ంచండి అని అమాయక ప్రజలను గురి పెట్టుకొని వారి చేత డబ్బులు కట్టించుకుంటున్నారని, ముందుగా అందరికి ఆశ కలిగేలా కొందరికి మాత్రమే ప్రయో జనం చేకూర్చి ఎక్కువ మొత్తంలో ఊహించనంతగా ప్రజలను మోసం చేసి రాత్రికి రాత్రే బోర్డులు తిప్పే స్తారని తెలిపారు.


వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వేలల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో డబ్బులు ఇస్తామని స్కీమ్‌లు అన్ని కూడా మోసపూరితమైనవేనని గుర్తిం చుకోవాలన్నారు. ఎందుకంటే అవే నిజమైతే మనంమం తా ఇంత కష్టపడుతూ డబ్బులు సంపాదించాల్సిన పనిలేదన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన రెండు స్కీమ్‌ల కంపెనీలు ఇలా కొన్ని డైరెక్ట్‌, మరికొన్ని ఆన్‌లైన్‌ స్కీమ్‌ ద్వారా ఎక్కువ మంది ఆమా యక ప్రజల నుండి డబ్బులు కట్టించుకుంటున్నట్లు త మ దృష్టికి వచ్చిందన్నారు. ఎక్కువగా వీరి ఉచ్చులో అంగన్‌వాడీ టీచర్లు, మహిళసంఘాల సభ్యులు, బీడీ కార్మికులు, రోజువారి సంపాదించేవారు ఇలాంటి మోస పూరిత చిట్‌ఫండ్‌, లక్కీడ్రాల వల్ల మోసపోతు న్నారన్నారు. తద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నార న్నారు. ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బులను నష్టపో కూడదనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా ప్రజలందరికి పత్రిక ప్రకటన ద్వారా, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, సెక్రటరీలు, వీఆర్‌వోల అధికారుల యొక్క వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా ఈ విషయం అందరికి తెలిసేలా కామారెడ్డి జిల్లా పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తుందన్నారు.


ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి నకిలీ చిట్‌ఫండ్‌, చిట్టీలు, భారీ స్కీమ్‌లు, లక్కీ డ్రాల యందు డబ్బులు కట్టండి అని అడిగిన, మీ దృష్టికి వచ్చినా, కట్టిమోసపోయిన వారు మీ సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాల న్నారు. ఇకపై నకిలీ చిట్‌ఫండ్స్‌, స్కీమ్‌లు, లక్కీడాలు కట్టి మోసపోవద్దని తెలిపారు. ఒక చిట్‌ఫండ్‌, స్కీమ్‌, లక్కీడ్రాలు ప్రారంభించాలంటే ముందుగా రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలన్నారు. అదే విధ ంగా ఎంతమేరకు వ్యాపారం చేయలనుకున్నారో దానికి తగినట్టుగా రిజిస్ట్రార్‌ వద్ద నగదు ఉంచాల్సి ఉంటు ందన్నారు. ఇలా చిట్‌ఫండ్స్‌, స్కీమ్‌లు నడిపేవారు ఇత ర వ్యాపారాలు చేసి అందులోని నష్టాన్ని చిట్‌ఫండ్‌ ద్వారా మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి చిట్‌ ఫండ్‌, స్కీమ్‌లు నడుపువారు. ఎలాంటి వ్యాపారాలు చేయవద్దని నిబంఽధనలు కూడా ఉన్నాయన్నారు.


ఎంత మేరకు వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారో అం త మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుందని, అంతకన్న ఎక్కువ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు ఉన్నాయన్నారు. ఏ ఏరియాలో చేస్తున్నారు. ఎంత కా లం అనేది పూర్తిగా ముందుగా నిర్ణయించబడి ఉంటు ందన్నారు. మనం చేస్తున్న చిట్‌ఫండ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీ స్‌లో నమోదు కాబడి ఉందా లేదా అనేది  కూడా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవాలన్నారు. వారిచ్చే ఫోన్‌ నంబ ర్లు, అడ్రస్‌, చూపించే దస్తావేజులు చూసి నమ్మవద్ద న్నారు. మరో సారి ప్రజలకు గుర్తు చేస్తున్నానని, అత్య శకు పోయి మోసాలకు గురి కాకుండా ఉండాలని జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-02-23T07:05:20+05:30 IST