Abn logo
Sep 18 2021 @ 00:06AM

నిరుద్యోగ భారత్‌గా మార్చొద్దు

నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

గుజరాతీపేట: దేశాన్ని నిరుద్యోగ భారత్‌గా మార్చొద్దని.. వీలైనంత వరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా శుక్ర వారం జిల్లాయువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగం దినం నిర్వహించారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్‌ భవనం వద్ద నిరసన ప్రదర్శన చేప ట్టారు. కోట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి యువతను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు డీఎస్‌కే ప్రసాద్‌, రాష్ట్ర బీసీసెల్‌ కన్వీనర్‌ సనపల అన్నాజీరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి,  తదితరులు పాల్గొన్నారు.