కేసీఆర్‌కు డౌన్‌ఫాల్‌ షురూ!

ABN , First Publish Date - 2021-03-05T06:08:11+05:30 IST

‘‘సీఎం కేసీఆర్‌కు డౌన్‌ఫాల్‌ షురువయ్యింది.. ఇపుడు అయ్యా అప్ప అంటున్నాడు.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలవనున్నారు..

కేసీఆర్‌కు డౌన్‌ఫాల్‌ షురూ!
సిద్దిపేటలో మున్సిపాలిటీ వార్డులో పార్టీ జెండాను ఎగురవేసిన నర్సారెడ్డి, నాయకులు

బీజేపీదీ బలుపు కాదు.. వాపే

ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్‌ పార్టీయే

ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డిలను పట్టించుకోవద్దు

కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి


తొగుట, మార్చి 4: ‘‘సీఎం కేసీఆర్‌కు డౌన్‌ఫాల్‌ షురువయ్యింది.. ఇపుడు అయ్యా అప్ప అంటున్నాడు.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలవనున్నారు.. ఇక టీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ కావడం ఖాయమని’’ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి జోస్యం చెప్పారు. గురువారం తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామంలోని స్వర్గీయ ముత్యంరెడ్డి స్మృతి వనంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి దుబ్బాక ఎమ్మెల్యే వస్తాడా..? హరీశ్‌రావు వస్తాడా..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌ బక్కపడ్డాడని... అదేవిధంగా హరీశ్‌ను కూడా నలువైపులా ఒత్తిడి తెచ్చి బక్కగా చేయాలని కార్యకర్తలకు నర్సారెడ్డి సూచించారు. గ్రూపులకు కాంగ్రెస్‌ పార్టీలో తావులేదన్నారు. బీజేపీది బలుపు కాదు వాపేనని, దాన్ని పట్టించుకోవద్దన్నారు. ఉత్తమ్‌కుమార్‌, రేవంత్‌రెడ్డి గురించి పట్టించుకోవద్దని, కార్యకర్తలందరు కలిసికట్టుగా చెరుకు శ్రీనివా్‌సరెడ్డి నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. అంతకుముందు స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశానికి దుబ్బాక కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, పీసీసీ జాయింట్‌ సెక్రటరీ కిష్టారెడ్డి, ఎంపీపీ లతనరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, నాయకులు సీతారాంరెడ్డి, నరేందర్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, శ్రీనాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఉప్పలయ్య, తిరుపతి, సుధాకర్‌ రెడ్డి, బాల్‌రెడ్డి, అఖిల్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.


కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్‌ స్పందించాలి

సిద్దిపేట అర్బన్‌, మార్చి 4: కేంద్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని తూంకుంట నర్సారెడ్డి ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని 25, 27వార్డుల్లో పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డుల విభజన చేశారని, వాటిని కూడా అధికార పార్టీకి చెందినవారికోసమే అధికారులు విభజించారని ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా 50 వేల మందికి పైగా లబ్ధిదారులు ఉంటే కనీసం 10 వేల మందికి కూడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తాడూరి శ్రీనివా్‌సగౌడ్‌, రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం, భవానిరెడ్డి, గంప మహేందర్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌చారి, మైనార్టీ సెల్‌ నాయకులు వహీద్‌ ఖాన్‌, చాంద్‌ బియా, గాడిపల్లి శ్రీనివా్‌సరెడ్డి, తిరుపతిరెడ్డి, నరసింహ, ఉమేష్‌ యాదవ్‌, గ్యాదరి మధు, సయ్యద్‌, వంగరి నాగరాజు, సలీం, ఫయాజ్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:08:11+05:30 IST