Kabul: విమానాశ్రయంలో యూఎస్ మిలటరీ జాగిలాలు?

ABN , First Publish Date - 2021-09-01T14:21:19+05:30 IST

యునైటెడ్ స్టేట్స్ తన సైనిక దళాల ఉపసంహరణ తర్వాత డజన్ల కొద్దీ మిలటరీ జాగిలాలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వదిలివేశారు...

Kabul: విమానాశ్రయంలో యూఎస్ మిలటరీ జాగిలాలు?

తమవి కాదంటున్న యూఎస్ ఆర్మీ... సోషల్ మీడియాలో వైరల్ 

కాబూల్: యునైటెడ్ స్టేట్స్ తన సైనిక దళాల ఉపసంహరణ తర్వాత డజన్ల కొద్దీ మిలటరీ జాగిలాలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వదిలివేశారు. విమానాశ్రయంలోని సైనిక రహిత హెలికాప్టర్ ముందు ఉన్న బోన్ల లోపల మిలటరీ జాగిలాలు ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మిలటరీ జాగిలాలు యూఎస్ మిలిటరీకి చెందినవి కాదని పెంటగాన్ ప్రకటించింది.విమానాశ్రయంలో వదిలివెళ్లిన మిలటరీ జాగిలాలు కాబూల్ స్మాల్ యానిమల్ రెస్క్యూ అదుపులో ఉన్నాయని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ చెప్పారు.



యూఎస్ మిలిటరీ హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిలటరీ జాగిలాలను బోన్లలో ఉంచలేదని కిర్బీ ట్వీట్ చేశారు. జాగిలాలను సైనిక విమానాల్లో అనుమతించనందున వాటిని బోన్లలో విమానాశ్రయంలోనే వదిలివెళ్లారని అఫ్ఘాన్లు అంటున్నారు.డజన్లకొద్ది యూఎస్ మిలటరీ జాగిలాలు, ఇతర జంతువులను వదిలివెళ్లారని, అఫ్ఘాన్ వీధుల్లో 100 కుక్కలను తాము రక్షించామని పెటా పేర్కొంది. 

Updated Date - 2021-09-01T14:21:19+05:30 IST