నిరుపయోగంగా బాక్స్‌ డ్రైన్‌ పనులు

ABN , First Publish Date - 2021-04-09T07:07:02+05:30 IST

లింగోజిగూడ తపోవన్‌కాలనీలో ఇంజనీరింగ్‌ అధికారులు చేపట్టిన బాక్స్‌ టైప్‌డ్రైన్‌ పనులు నిరుపయోగంగా మారాయని బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు.

నిరుపయోగంగా బాక్స్‌ డ్రైన్‌ పనులు
తపోవన్‌కాలనీలో డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

ఎల్‌బీనగర్‌,ఏప్రిల్‌ 8(ఆంరఽధజ్యోతి): లింగోజిగూడ తపోవన్‌కాలనీలో ఇంజనీరింగ్‌ అధికారులు చేపట్టిన బాక్స్‌ టైప్‌డ్రైన్‌ పనులు నిరుపయోగంగా మారాయని బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. గురువారం తపోవన్‌కాలనీ, శ్రీరాంనగర్‌, వడ్డెరబస్తీ, భాగ్యనగర్‌కాలనీలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. వరదనీటి కోసమని రూ. 84 లక్షలతో బాక్స్‌డ్రైన్‌ పనులు చేపట్టారని చెప్పారు. సరూర్‌నగర్‌ చెరువు తూము లెవల్‌ వరకు నిర్మించాల్సిన బాక్స్‌టైప్‌ డ్రైన్‌ అంతకంటే కిందికి నిర్మించడంతో నిరుపయోగంగా మారిందన్నారు. దాంతో వర్షపు నీరు ఒక మీటరు ఎత్తులో వస్తే తపోవన్‌కాలనీ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భాగ్యనగర్‌కాలనీ ఫేస్‌-2 రోడ్‌ నంబర్‌ 8లో డ్రైనేజీనీరు బయటకు వెళ్లే నాలా పూడుకుపోవడంతో సంవత్సరకాలంగా మురుగు నీరు రోడ్డుపైన నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కళ్లెం రవీందర్‌రెడ్డి, సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి అంజన్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరుట్ల సురేష్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-09T07:07:02+05:30 IST