డీటీసీ విచారణ

ABN , First Publish Date - 2021-04-20T03:22:20+05:30 IST

పట్టణానికి చెందిన ఓంకారం ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో సోమవారం డిప్యూటీ రవాణా కమిషనర్‌ సుబ్బారావు విచారణ చేపట్టారు

డీటీసీ విచారణ
విచారణ చేస్తున్న డిప్యూటీ రవాణా కమిషనర్‌ సుబ్బారావు

ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 19: పట్టణానికి చెందిన ఓంకారం ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో సోమవారం డిప్యూటీ రవాణా కమిషనర్‌ సుబ్బారావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సొసైటీ నిర్వాహకుడు ఓంకారం వెంకటేశ్వరరాజు నివాసానికి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరాజు రహదారి భద్రతలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు దరఖాస్తు చేసుకొన్నారన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అతను ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయలేదని, ప్రారంభ దశలో ఉన్నారని గుర్తించామన్నారు. విచారణలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. జిల్లాలో లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ కార్డులు 20 వేల వరకు ఆగిపోయాయని, వాటిని త్వరలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కావలి బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌ బాలమురళీకృష్ణ, కార్యాలయ ఏవో శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-20T03:22:20+05:30 IST