మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-05-17T05:39:53+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు మంద కొడిగా సాగుతోంది. లారీలు సక్రమంగా రాకపోవడం, హమాలీల కొరత వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్మూర్‌లో కొంత మంది రైతులు నెల రోజులుగా ధా న్యం విక్రయానికి ఎదురుచూస్తున్నరంటే ఎంత జా ప్యం జరుగుతుందో అర్థమవుతోంది.

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
ఆదివారం కురిసిన వర్షం వల్ల ఆర్మూర్‌లో తడిసిన ధాన్యం

జిల్లాలో మందకొడిగా ధాన్యం సేకరణ
నెల రోజులుగా కల్లాల మీదే ధాన్యం
లారీలు రాక ముందుకు సాగని కొనుగోళ్లు
ఇష్టానుసారంగా తరుగుతీస్తున్న మిల్లర్లు
అదనంగా ట్రాన్స్‌పోర్టర్‌ వసూలు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత

ఆర్మూర్‌, మే 16: జిల్లాలో ధాన్యం కొనుగోలు మంద కొడిగా సాగుతోంది. లారీలు సక్రమంగా రాకపోవడం, హమాలీల కొరత వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్మూర్‌లో కొంత మంది రైతులు నెల రోజులుగా ధా న్యం విక్రయానికి ఎదురుచూస్తున్నరంటే ఎంత జా ప్యం జరుగుతుందో అర్థమవుతోంది. ఆరుగాళం శ్రమిం చి పండించడం ఒక ఎత్తయితే.. ధాన్యం విక్రయించ డం మరో ఎత్తవుతోంది. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ధా న్యం కొనుగోలు సక్రమంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొందరి వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం లారీలు రావడం పెద్ద సమస్య గా తయారైంది. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం అలాగే ఉంటోంది. రైస్‌మిల్లుకు వెళ్లిన లారీ మూడు, నాలుగు రోజుల వరకు రావడం లేదు. లారీలు రాకపోవడానికి ప్రధానంగా హామాలీల కొరతగా చెబుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల హమాలీలు సొంత గ్రామాలకు వెళ్లారని, దీంతో అన్‌ లోడ్‌ సమస్య అవుతోందన్నారు. ఇవే కాకుండా తరుగు పేరిట రైస్‌ మిల్లర్ల వేధింపులు కూడా కారణమని తెలుస్తోంది. తూకం సమయంలోనే క్వింటాకు రెండున్నర కిలోల వ రకు ఎక్కువ తూకం వేస్తున్నారు. అయినప్పటికీ లారీ మిల్లుకు వెళ్లిన తర్వాత ఇష్టానుసారంగా తరుగుపేరి ట కోత విధిస్తున్నారు. రైతులు తరుగు అంగీకరించిన తర్వాతే అన్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో లారీలు రావడా నికి ఆలస్యమవుతోంది. ధాన్యం తూకం వేసిన తర్వాత తరుగుతీస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పలుమార్లు హెచ్చరించా రు. అయినప్పటికీ మిల్లర్లు బేఖాతరు చేస్తున్నారు. మి ల్లర్లు తరుగు పేరిట వేధిస్తున్నట్టు రైతులు ఆందోళన చేసినప్పటికీ జిల్లాలో ఒక్క మిల్లరు మీద కూడా చర్య లు తీసుకోలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మి ల్లుకు చేర్చడానికి ట్రాన్స్‌పోర్టు కంపెనీకి కాంట్రాక్టు ఇ చ్చారు. ధాన్యం విక్రయించిన తర్వాత రవాణా బాధ్య త రైతులది కాదు. కానీ, రైతుల వద్ద ట్రాన్స్‌పోర్టు చార్జీ ల పేరిట సంచికి రూ.2 వసూలు చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి ధాన్యాన్నే లోడు చేస్తున్నారు. హ మాలీలకు సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న అల్పపీడనం
అల్పపీడనం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను వల్ల సో మ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటు ఆదివా రం మేఘావృతం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన కు గురవుతున్నారు. జిల్లాలో ఆదివారం కురిసిన వర్షా నికి పలుచోట్ల ధాన్యం తడిసి పోయింది. ఆర్మూర్‌లో ఓ రైతు ధాన్యాన్ని 15రోజుల క్రితం తేమ పరిశీలించా రు. ఈ ధాన్యం తూకం వేయాల్సి ఉండగా పూర్తిగా త డిసి పోయింది. వాతావరణ హెచ్చరికలతో కొంత మం ది ధాన్యాన్ని గోదాంలు, ఇళ్లల్లో నిల్వ చేసుకున్నప్పటికీ అనేక మంది ధాన్యం కల్లాల మీదే ఉంది. తూకం కోస ం కొందరు కల్లాల మీద ఉంచగా, తూకం వేసినప్పటి కీ అనేక మంది ధాన్యం లారీలు రానందున కల్లాల వ ద్దే ఉంది. తూకం వేసిన తర్వాత రైతులకు భాధ్యత లే దు. కానీ, ధాన్యం తూకం వేసి మిల్లరు తీసుకునే వర కు రైతులే బాధ్యత వహిస్తున్నారు. తడిసిపోతే మిల్ల రు తరుగు ఎక్కువ తీస్తారని రైతులు ఆందోళన చెం దుతున్నారు. వేగంగా కొనుగోలు జరిగితే ఈ పాటికే ధాన్యం సేకరణ పూర్తయ్యేది. మందకొడిగా సాగడం వల్ల సగం వరకే పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో అధికా రులు ధాన్యం సేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T05:39:53+05:30 IST