Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాళి కట్టే సమయంలో వరుడి ముందే పెళ్లికూతురి నుదటి మీద.. ఇంతకీ ఎవరా యువకుడు.. అసలేం జరిగిందంటే..

ఒక్కోసారి కలలో కూడా ఊహించని ఘటనలు.. ఇలలో జరుగుతుంటాయి. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఎలాంటి వారికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. పెళ్లి మండపంపై వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. తీరా తాళి కట్టే సమయంలో ఓ యువకుడు ఎంటరయ్యాడు. తర్వాత అతడు చేసిన పనికి.. పెళ్లి కొడుకుతో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. వధూవురులు ఇద్దరూ మండపంపై ఉన్నారు. వారి వారి సంప్రదాయం ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వధువు మెడలో దండ వేసేందుకు వరుడు సిద్ధమయ్యాడు. ఇంతలో సడన్‌గా ఓ యువకుడు సీన్‌లోకి ఎంటరయ్యాడు. అంతా షాక్‌ నుంచి తేరుకోకముందే.. వధువు ముఖంపై పసుపు రుద్దేశాడు. తర్వాత మళ్లీ తన జేబు నుంచి కుంకుమ తీసి, బలవంతంగా వధువు నుదుటి మీద బొట్టు పెట్టాడు.

వారికి ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భర్త లింగమార్పిడి.. తర్వాత యువకుడితో ఆమె చేసిన సహజీవనం.. అంతవరకు వెళ్తుందని ఊహించలేదు..

ఊహించని ఈ ఘటనతో వరుడితో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వధువు నుదుటి మీద బొట్టు పెట్టగానే.. అక్కడున్న వారంతా తేరుకుని.. అతడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను గతంలో వధువును ప్రేమించేవాడని తెలిసింది. అయితే ఆ అమ్మాయి మాత్రం నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. ఇప్పడు పెళ్లి జరుగుతుందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా.. అప్పుడు ఆగిపోయిన కార్యక్రమాన్ని మరుసటి రోజు యథావిధిగా నిర్వహించారు.

ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. పనుందని పక్కకు తీసుకెళ్లిన ఎస్ఐ.. ఆమె బలహీనతను గమనించి..


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement