వైభవంగా ముగిసిన దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T05:17:48+05:30 IST

దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవం గా ముగిశాయి.

వైభవంగా ముగిసిన దసరా వేడుకలు
త్రిపురాంతకంలో బలిహరణ పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు

ఘనంగా శమీ దర్శనం, గ్రామోత్సవాలు

వైభవంగా ముగిసిన దసరా వేడుకలు

ఘనంగా శమీ వృక్ష దర్శనం, గ్రామోత్సవాలు

గిద్దలూరు, అక్టోబరు 16 : దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవం గా ముగిశాయి. విజయదశమిని సందర్భంగా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానాల నుంచి అమ్మవారు, స్వా మివారు శ్రీకుసుహ హరనాథ మందిర ఆవరణలో సెమీ వృక్షం వద్దకు ఊరేగింపుగా వచ్చి శమీవృక్ష పూజలు నిర్వహించారు. కుసుమహరనాథ మందిరంలో సైతం ప్రత్యేక పూజలు,  శమీ దర్శన కార్యక్రమం నిర్వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం శనివారం రాత్రి 7గంటల సమయంలో ప్రారంభమైంది. పట్టణంలోని ప్రధాన వీ ధుల్లో గ్రామోత్సవం సాగింది. తమ  ఇళ్ల వద్దకు వచ్చిన వాసవీ మాతకు తాంబాలాలు, జాకెట్లు, పసుపు, కుంకుమ, హారతులిచ్చి పూజలు ని ర్వహించారు.  అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు  రంగసత్యనారాయణ, కార్యదర్శి  సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, వివిధ మతాలకు చెందిన నాయబ్‌రసూల్‌, ఖాశింబాబా, షాన్షావలి, మార్తాల సుబ్బారెడ్డి, పందీటి రజనిబాబు, గుర్రం డానియేలు పాల్గొన్నారు. 

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగి శాయి. త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయాల్లో దసరా పండుగ రోజున వేదపండితులు మామిళ్ళపల్లి నాగఫణిశాస్ర్తి, ఫణీంద్రకుమార్‌శర్మ, అర్చకులు ప్రసాద్‌ శర్మ, విశ్వనారాయణశాస్ర్తి బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా సింహవాహనంపై అలంకరించి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది.  

మార్కాపురంలో..

మార్కాపురం(వన్‌టౌన్‌) :  శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి చెరువు సమీపంలోని దసరా మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అప్పనాచార్యులు స్వామివారికి విశేష అలంకరణ,  పూజలు నిర్వహించారు. సెమీ పూజ నిర్వహించారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. 

కంభంలో..

కంభం : దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు పాన్పు సేవలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ అధ్యక్షుడు రావూరి రంగరమేష్‌ తెలిపారు. రా మాలయం నుంచి మెయిన్‌ బజారు మీదుగా అమ్మవారిశాల వ రకు 108 కలశాలతో బాలికలు తీర్థం తీసుకువచ్చారు. అ నం త రం వాసవీ మాతకు అభిషేకం, కుంకుమ పూజలు చేశారు. శనివారం మధ్యాహ్నం గ్రామసమరాధన, రాత్రి 11 గంటల తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి, రా ములవార్లను పారువేట ఊరేగింపు ఘనంగా జరిగింది. 

కొమరోలులో..

కొమరోలు : కొమరోలులోని అన్ని గ్రామాల్లో దసరా శరన్నవ రాత్రులను ప్రజలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. కొమరోలు, రా జుపాలెం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారిశాలల్లో ప్ర త్యేక పూజలు జరిగాయి.  ఈ సందర్భంగా సాంస్కృతిక కా ర్యక్ర మాలను ఏర్పాటు చేశారు. వేంకటేశ్వరస్వామి దేవాల యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. 


Updated Date - 2021-10-17T05:17:48+05:30 IST