విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-10-28T07:23:22+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు విద్యుల్లో నిర్లక్ష్యం వహించి గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన తహశీల్దారు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.

విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు

రంపచోడవరం ఆర్డీవో సీనానాయక్‌

తహశీల్దారు. డిప్యూటీ తహశీల్దార్లకు షోకాజ్‌ నోటీసు

 మారేడుమిల్లి, అక్టోబరు 27: ప్రభుత్వ ఉద్యోగులు విద్యుల్లో నిర్లక్ష్యం వహించి గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన తహశీల్దారు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. మండలంలో కొండపోడు పట్టా లు, రైతు భరోసా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలులో జాప్యంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తహశీల్దారు కార్యాలయం చుట్టుపక్కల పరిసరాలు, కార్యాలయం చాలా అధ్వానంగా ఉ న్నాయన్నారు. ఉదయం 11 గంటలైనా విధులకు రాకపోవడంతో తహశీల్దారు విశ్వేశ్వరరావు, డి ప్యూటీ తహశీల్దారు రాజులకు షోకాజ్‌ నోటీసు లు జారీ చేసినట్టు వెల్లడించారు.  రైతు భరోసాకు సంబంధించి 134 మంది గిరిజనులకు బ్యాంకు ఖాతాలు, 17 మందికి ఆధార్‌ కార్డులు లేవన్నారు.  వారికి తానే దగ్గరుండి ఖాతాలు తెరిపిస్తానని తెలిపారు. అనంతరం మారేడుమిల్లి, బోదులూరు సచివాలయాలను సందర్శిం చి అక్కడి సిబ్బంది పనితీరు, రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. యూ నియన్‌ బ్యాంకుకు వెళ్లి పథకాలకు అర్హులై, ఖాతాలు లేని గిరిజనులకు తక్షణం ఖాతాలు తెరవాలని మేనేజరును కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరత్నం, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




ఉపాధ్యాయులను కలిసిన ఎస్టీయూ నాయకులు

కడియం, అక్టోబరు 27: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎస్టీయూ అభ్యర్థిని గెలిపించాలని ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కేవీ శేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు మండలంలో ని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను కలిశారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.జ్యోతి, రాష్ట్ర కౌన్సిలర్‌ జీఎన్‌ఎం నాయుడు, రాష్ట్ర కో-కన్వీనర్‌ టి.శ్యామ్‌బాబు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్‌.సత్యనారాయణ, ఆలమూరు మండల మహిళా అధ్యక్షురాలు కె.సుజాత, జిల్లా నాయకులు కె.దుర్గారావు, ఎం.లక్ష్మీనారాయణ, కడియం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.లక్ష్మణరావు, దాసరి శివ, ఆర్థిక కార్యదర్శి జి.నాగవేంద్రరెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 






Updated Date - 2020-10-28T07:23:22+05:30 IST