Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతి బూత్‌లో వందమందితో సభ్యత్వం చేయాలి

 - కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్‌ సిరిసిల్ల రాజయ్య

 కరీంనగర్‌ అర్బన్‌, నవంబరు 29: జిల్లాలోని ప్రతి పోలింగ్‌బూత్‌కు ఒకరు ఎన్‌రోల్‌ అయి, ప్రతి బూత్‌లో వందమందికి తక్కువ కాకుండా సభ్యత్వం నమోదు చేయాలని  డిజిటల్‌ సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్‌, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కమిటీ సూచన మేరకు పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించేందుకు డీసీసీ కార్యాలయంలో సోమవారం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని జిల్లా, పట్టణ, మండల అధ్యక్షులతో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎవరికైనా సభ్యత్వ నమోదులో సందేహాలుంటే కోఆర్డినేటర్‌ కోటేశ్వర్‌రావును సంప్రదించాలన్నారు. డిసెంబరు 2వ తేదీలోపు ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఒకరు తప్పనిసరిగా ఎన్‌రోల్‌ కావాలని పేర్కొన్నారు. సమావేశంలో  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, సభ్యత్వ నమోదు సాంకేతిక నిపుణులు కోటేశ్వరరావు, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, బల్మూరి వెంకట్‌, నాగుల సత్యనారాయణగౌడ్‌, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సంగీతం శ్రీనివాస్‌, జలగం ప్రవీణ్‌, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, పిల్లి కనుకయ్య, శ్రీనివాస్‌, పోరుమల్ల మనోహర్‌, ఎండీ అజీమ్‌, ముద్దం తిరుపతి పాల్గొన్నారు. 


Advertisement
Advertisement