పేదల కాలనీల్లో సకల సదుపాయాలు: జేసీ

ABN , First Publish Date - 2021-01-21T06:01:29+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జనవరి 20: పేదల కాలనీల్లో సకల సదుపాయాలు కల్పించనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి తెలిపారు. కొమరగిరి లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్‌-2ను ఎంచుకున్న 300 మంది లబ్ధిదారులతో బుధవారం ఆమె రంగరాయ

పేదల కాలనీల్లో సకల సదుపాయాలు: జేసీ
లబ్ధిదారుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ కీర్తి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జనవరి 20: పేదల కాలనీల్లో సకల సదుపాయాలు కల్పించనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి తెలిపారు. కొమరగిరి లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్‌-2ను ఎంచుకున్న 300 మంది లబ్ధిదారులతో బుధవారం ఆమె రంగరాయ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొమరగిరి లే అవుట్‌లో నగరంలోని 29 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు 16 వేల ఇళ్ల నిర్మాణం జరగనుందన్నారు. నీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు తదితర సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. జనాభా ఆధారంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారులే స్వయంగా ఇంటిని నిర్మించుకుంటే దశలవారీగా రూ.లక్షా 80వేలు అందిస్తామని, ఇది ఆప్షన్‌-2 లో భాగమని ఆమె తెలిపారు. మార్కెట్‌ ధరలతో పోల్చితే తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. లే అవుట్‌లోనే వివిధ సంస్థలు సామగ్రిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. మరో రెండు వారాల్లో గృహ నిర్మాణాలను ప్రారంభించాలని జేసీ సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ  అం దరూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించడం వల్ల మెటీరియల్‌ ఖర్చు చాలా వరకు తగ్గడంతో పాటు త్వరలోనే ఓ అందమైన ఊరు ఏర్ప డుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణసంస్థ ఎండీ కార్యాలయ ప్రత్యేక అధికారులు సిజయరామాచారి, కె.రామచంద్రన్‌, వీఎ్‌సడబ్ల్యూఎస్‌ జేడీ మల్లికార్జున్‌, హెబిటేట్‌ ఫర్‌ హ్యూమనిటీ ఎన్‌జీవో ప్రతినిధి ప్రవీణ్‌పాల్‌, హౌసింగ్‌ పీడీ జీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:01:29+05:30 IST