9 నెలల కొవిడ్‌ శిశువుకు ఎక్మో చికిత్స

ABN , First Publish Date - 2021-06-18T16:05:12+05:30 IST

కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్న తొమ్మిది నెలలు శిశువుకు కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజన్‌) చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. ఆదిలాబాద్‌ జిల్లాకు

9 నెలల కొవిడ్‌ శిశువుకు ఎక్మో చికిత్స

నెల రోజుల తర్వాత మెరుగుపడిన ఆరోగ్యం

హైదరాబాద్‌ సిటీ: కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్న తొమ్మిది నెలలు శిశువుకు కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజన్‌) చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీయాష్‌ (9 నెలలు) జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. నెల రోజుల క్రితం బాలుడిని కొండాపూర్‌లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. శిశువుకు ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉండడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌ చికిత్స అందించారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్‌ (హెచ్‌ఎ్‌ఫవోవీ)పైకి చేర్చి చికిత్సను కొనసాగించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి క్లిష్టతరంగా మారడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 12 రోజుల పాటు ఎక్మో సపోర్ట్‌ చికిత్స అందించడంతో బాలుడి ఆరోగ్యం మెరుగుపడింది. తర్వాత ఎక్మోను తొలగించి మూడు రోజుల పాటు వెంటిలేటర్‌ చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకున్నాడు. అనంతరం తల్లి పాలు ఇప్పించారు. నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తర్వాత బాలుడిని డిశ్చార్జి చేశారు. కొవిడ్‌ సోకిన తొమ్మిది నెలల శిశువుకు ఎక్మో ఉపయోగించడం ఇదే మొదటి సారి అని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగం అధిపతి డాక్టర్‌ నందకిషోర్‌ తెలిపారు.

Updated Date - 2021-06-18T16:05:12+05:30 IST