అహ్మద్‌ పటేల్‌ను మళ్లీ ప్రశ్నించిన ఈడీ

ABN , First Publish Date - 2020-07-01T08:27:21+05:30 IST

హవాలా కేసులో కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మళ్లీ ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకాలేనని పటేల్‌ ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో...

అహ్మద్‌ పటేల్‌ను మళ్లీ ప్రశ్నించిన ఈడీ

హవాలా కేసులో కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మళ్లీ ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకాలేనని పటేల్‌ ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం ఆయన నివాసంలోనే అధికారులు ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ ప్రధాన ప్రమోటర్లు, డైరెక్టర్లయిన నితిన్‌ జయంతిలాల్‌ సందేశారా, చేతన్‌ జయంతిలాల్‌ సందేశారా, దీప్తి సందేశారా వివిధ బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకుని, ఆ నిధులను వేరే కార్యకలాపాలకు మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరంతా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసులో పటేల్‌  వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 


Updated Date - 2020-07-01T08:27:21+05:30 IST