మెరిట్‌ జాబితాలో తప్పులు సవరించండి

ABN , First Publish Date - 2020-08-13T06:42:06+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన కాంట్రాక్టు వైద్య సిబ్బంది పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వి

మెరిట్‌ జాబితాలో తప్పులు సవరించండి

104 ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ప్రసాద్‌ డిమాండ్‌ 


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 12 : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన కాంట్రాక్టు వైద్య సిబ్బంది పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి విడుదల చేసిన మెరిట్‌ జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలను సరి చేయాలని అంధ్రప్రదేశ్‌ 104 ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) గౌరవాధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మెరిట్‌ జాబితా యావత్తూ తప్పుల తడకగా ఉందని ముఖ్యంగా ఇప్పటికే సర్వీసులో ఉన్న 104 వాహనాల అభ్యర్థులకు వెయిటేజ్‌ లేకుండా ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాబి తా అనర్హులకు లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు.


దీంతో పాటు ల్యాబ్‌ టెక్నీ షియన్‌ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఇచ్చిన నియమ నిబంధ నలకు భిన్నంగా బీఎస్సీ (ఎంఎల్‌టీ) అభ్యర్థుల దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత 12 సంవత్సరాలుగా 104 వాహనాల్లో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, ఏఎన్‌ఎంలు, జీఎన్‌ఎంలకు న్యాయం చేయాలని సంఘ నాయకులు సునీల్‌ కుమార్‌, మృత్యుంజయరావు, సాగ ర్‌, మాలతి, కమల, రామకృష్ణ, అనిల్‌, మనోహర్‌, సుకన్య తదితరులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-13T06:42:06+05:30 IST