Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యాదీవెన ద్వారా రూ.67.97 కోట్లు జమ

కాకినాడ సిటీ, నవంబరు 30: జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 1,12,042 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మూడో విడత మొత్తం రూ.67.97 కోట్లు జమ చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి 2021-22 సంవత్సరానికి విద్యా దీవెన పఽథకం కింద మూడో విడత ఫీజు రియంబర్స్‌మెంట్‌ సొమ్మును తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, జడ్‌పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర మేయర్‌ సుంకర శివప్రసన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలో పఽథకం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం లబ్ధి మొత్తానికి సంబంధించిన చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్‌.సత్తిబాబు, సాంఘిక సంక్షేమశాఖ జేడీ రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మయూరి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కామేశ్వరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement