క్షయ నిర్మూలన కోసం కృషి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-04-10T05:47:26+05:30 IST

క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నందున వైద్య సిబ్బంది ప్రజలను చైతన్య పరచాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఈశ్వర్‌దాస్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని శ్యాం పూర్‌లో నిర్వహించిన వైద్య సిబ్బంది, ఆశాలతో జరిగిన అవగాహన సమావేశ ంలో ఆయన మాట్లాడారు.

క్షయ నిర్మూలన కోసం కృషి ప్రభుత్వం కృషి

ఉట్నూర్‌, ఏప్రిల్‌ 9: క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నందున వైద్య సిబ్బంది ప్రజలను చైతన్య పరచాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఈశ్వర్‌దాస్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని శ్యాం పూర్‌లో నిర్వహించిన వైద్య సిబ్బంది, ఆశాలతో జరిగిన అవగాహన సమావేశ ంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు శ్యాంపూర్‌ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరం వరకు క్షయ నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే క్షయ నియంత్రించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ హరిప్రియ, బి. కృష్ణ, సూపర్‌వైజర్‌ రాంబాయి, వెంకటేశ్వర్‌, మీర్జాబేగ్‌, అంబారావు, శ్రీనివాస్‌, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-10T05:47:26+05:30 IST