అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మసీద్‌లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ పండుగ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తు అభివృద్ధికి పాటు పడుతున్నరని అన్నారు.

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి
పేద ముస్లింలకు కిట్‌లు అందజేస్తున్న జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌

జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌
నార్నూర్‌, మే 9: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మసీద్‌లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ పండుగ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తు అభివృద్ధికి పాటు పడుతున్నరని అన్నారు. కరోనా విపత్కర సమయంలో కూడా ఏ ఒక్క ప్రజా సంక్షేమ పథకాలను నిలపకుండా యథావిధిగా కొనసాగిస్తుందన్నారు. మసీదులో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల ని కమిటీ సభ్యులు వినతి పత్రం ద్వారా జడ్పీ చైర్మన్‌ను కోరారు. స్పందించిన ఆయన నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌ జాదవ్‌, ఎంపీటీసీ పరమేశ్వర్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ సురేష్‌ ఆడే, ఉత్తం రాథోడ్‌, కనక ప్రభాకర్‌, సయ్యద్‌కాశీం, బాబాఖాన్‌, మహేర్‌ దుర్గే, హసన్‌ తదితరులు పాల్గొన్నారు.  
తలమడుగు: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన ముస్లింలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అందిస్తున్న రంజన్‌ పండుగ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తోట వెంకటేష్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న ఈ పండుగ కానుకలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. ఇందులో టీఆర్‌ఎస్‌ ఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ జీవన్‌రెడ్డి, నాయకులు గంగాదర్‌, సంజీవ్‌రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు రంజాన్‌కానుకలు అందించడం జరుగుతుందని ఉట్నూర్‌ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు దావులే బాలాజీ అన్నారు. ఆదివారం స్థానిక వజీర్‌పురలో ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. మాసం రోజుల పాటు పవిత్ర ఉపవాసాలు కొనసాగించి ముస్లింలు అత్యంత ప్రాధాన్యంగా రంజాన్‌ పండుగను నిర్వహిస్తుంటారని అన్నారు. సర్వమతాలతో కూడిన భారత దేశంలో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ  మండల అధ్యక్షుడు అహ్మద్‌ అజీమోద్దిన్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సింగారే భరత్‌, ఉట్నూర్‌ పట్టణ అధ్యక్షుడు జూవ్వాది అన్సారీతో పాటు నాయకులు సీరాజ్‌, ఆబ్రార్‌,  జూబేర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST