రజకుల అభివృద్ధికి కృషి: డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి

ABN , First Publish Date - 2021-01-17T05:42:05+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో రజకుల అభివృద్ధికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్‌ , టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

రజకుల అభివృద్ధికి కృషి: డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి
మహేందర్‌రెడ్డిని సన్మానిస్తున్న రజకసంఘం నాయకులు

యాదాద్రి రూరల్‌, జనవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో రజకుల అభివృద్ధికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్‌ , టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తమ సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను అందిస్తానని, ఆపద సమసయాలలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. రజక సంఘానికి తన వంతుగా రూ. లక్ష రూపాయాలను ఆర్థిక సహకారం అందజేశారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు శ్రీలోగిల్లు ఎండి. ఒంటేరు సురేష్‌రెడ్డి సైతం రజక సంఘానికి రూ. లక్ష రూపాయాలను అందజేశారు. మహేందర్‌రెడ్డిని, ఒంటేరు సురేష్‌రెడ్డిని వేర్వేరుగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సొప్పరి మధు, వాకిటి కిష్టయ్య, వార్డు సభ్యులు గుణగంటి బాబురావు, రజక సంఘం అధ్యక్షుడు బండ భాస్కర్‌రజక, వీరస్వామి పాల్గొన్నారు.


 మంత్రి కేటీఆర్‌ను కలిసిన  మహేందర్‌రెడ్డి

యాదాద్రి రూరల్‌, జనవరి 16: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్లకు ప్రత్యేక గుర్తింపు, వారికి ఇచ్చే గౌరవ వేతనం రూ. 25000 అమలు చేయాలని టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి రాష్ట్ర పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌ ప్రగతి భవనంలో పర్యాద పూర్వకంగా కలిశారు. వెంటనే ఆ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉన్నారు. 

Updated Date - 2021-01-17T05:42:05+05:30 IST