కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-01-16T05:18:04+05:30 IST

కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు, ఉమ్మడి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి షమీమ్‌అక్తర్‌ అన్నారు.

కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
కోదాడలో కోర్టు భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి షమీమ్‌ అక్తర్‌

హైకోర్టు, ఉమ్మడి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి షమీమ్‌అక్తర్‌ 

కోదాడ / హుజూర్‌నగర్‌, జనవరి 15: కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు, ఉమ్మడి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి షమీమ్‌అక్తర్‌ అన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఆయన శుక్రవారం పర్యటించారు. కోదాడలో నూతనంగా నిర్మించే న్యాయస్థానాల భవనాల కోసం స్థలాన్ని పరిశీలించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. హజూర్‌నగర్‌లోని కోర్టు హాల్‌లో బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. హుజూర్‌నగర్‌ కోర్టులోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.  మేళ్ళచెర్వు, చింతలపాలెం పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని క్రిమినల్‌ కేసులను హుజూర్‌నగర్‌ కోర్టుకు అధికారికంగా బదిలీ చేస్తామన్నారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించగా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సాముల రామిరెడ్డి ఆయనను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్డిలు ప్రియాంక, భారతీదేవి, శ్రీదేవి, కోదాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగార్జున, సాముల రాంరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, కాల్వ శ్రీనివాస్‌, నట్టె సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 ు. 

Updated Date - 2021-01-16T05:18:04+05:30 IST