విద్యాప్రమాణాల పెంపునకు కృషి

ABN , First Publish Date - 2022-02-22T05:34:21+05:30 IST

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ కే శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యాప్రమాణాల పెంపునకు కృషి
ఆశ కార్యకర్తకు హైజిన్‌ కిట్లను అందిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష 

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 21 : విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ కే శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని పీజేపీ క్యాంపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహించిన క్వాలిటీ లెర్నింగ్‌ ఇన్షియేటివ్‌ (క్యూఎల్‌ఐ) ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు క్యూఎల్‌ఐ కార్యక్రమాన్ని అమలు చేయా లని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లు గా పాఠశాలలు సక్రమంగా కొనసాగక పోవడంతో విద్యార్థుల్లో అవగాహనా సామర్థ్యం తగ్గిందని తెలి పారు. కృత్యాధార పద్ధతుల ద్వారా వారిలో సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. నోడల్‌ ఆఫీసర్‌ రమేష్‌ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి అన్ని మండలాల్లో పర్యవేక్షణ బృందాలు అన్ని మండలాల్లో పర్య టించి కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తాయని తెలి పారు. కార్యక్రమానికి గట్టు, కేటీదొడ్డి, ధరూరు, అయిజ, మల్దకల్‌ మండలాల ఉపాధ్యాయులు హాజర య్యారు. జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్తేరురాణి, రిసోర్స్‌పర్సన్లు రాంబాబు, రవీంద్ర, చిరంజీవి, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. 


రెడ్‌ క్రాస్‌ సేవలకు పూర్తి సహకారం

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. పట్టణంలోని కృష్ణవేణి కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన ఒక కార్య క్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ తరఫున మునిసిపల్‌, ఆరోగ్య సిబ్బంది, నాయి బ్రాహ్మణులకు హైజిన్‌ కిట్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రెడ్‌క్రాస్‌ సొసైటీ చేసిన సేవలు ఇతర సామాజిక, సేవా, స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్య క్రమంలో  ఐఆర్‌సీఎస్‌ చైర్మన్‌ జీ రమేష్‌, గౌరవ సభ్యు డు డాక్టర్‌ మోహన్‌రావ్‌, సంగాల అయ్యపు రెడ్డి, డీపీఎంవో మల్లికార్జున్‌, అబ్రహాం రాస్‌ పాల్గొన్నారు. 


సమన్యయంతో మండల అభివృద్ధికి కృషి

గట్టు : మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగి మండల అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గట్టులో సోమవారం నిర్వహించిన గట్టు మండల సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులపై అలసత్వం ప్రదర్శించకుండా, సకాలంలో పూర్తిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు.  సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను  సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్య క్రమంలో ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామల, వైస్‌ ఎంపీపీ సుమతి, ఎంపీడీవో రాఘవ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-22T05:34:21+05:30 IST