గుడ్డు పరిమాణం తగ్గితే వెనక్కి పంపించండి

ABN , First Publish Date - 2021-02-25T04:37:31+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందజేసే కోడిగుడ్డు పరిమాణం తగ్గితే వెంటనే వాటిని వెనక్కి పంపించాలని ఎండీఎం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం. వెంకటేశ్వర్లు హెచ్‌ఎంలకు సూచించారు.

గుడ్డు పరిమాణం తగ్గితే వెనక్కి పంపించండి
కోడిగుడ్డు పరిమాణాన్ని పరిశీలిస్తున్న ఎండీఎం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు


 సింగరాయకొండ, ఫిబ్రవరి 24 : మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందజేసే కోడిగుడ్డు పరిమాణం తగ్గితే వెంటనే వాటిని వెనక్కి పంపించాలని ఎండీఎం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం. వెంకటేశ్వర్లు హెచ్‌ఎంలకు సూచించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేసే కోడిగుడ్డు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా 37 గ్రాములే ఉండడాన్ని గమనించారు. పరిమాణం తగ్గితే వాటిని దించుకోకుండా వెనక్కి పంపించాలని ఆయన చెప్పారు. విద్యార్థుల మెనూను అందరికీ కనిపించే విధంగా పెట్టాలని సూచించారు.


Updated Date - 2021-02-25T04:37:31+05:30 IST