drugs smuggling: ఏడుగురు పాక్ జాతీయులకు మరణశిక్ష

ABN , First Publish Date - 2021-09-07T14:42:51+05:30 IST

ఈజిప్టు కోర్టు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు పాక్ జాతీయులకు మరణశిక్ష విధించింది....

drugs smuggling:  ఏడుగురు పాక్ జాతీయులకు మరణశిక్ష

ఈజిప్టు కోర్టు సంచలన ఉత్తర్వులు

కైరో (ఈజిప్ట్):ఈజిప్టు కోర్టు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు పాక్ జాతీయులకు మరణశిక్ష విధించింది. సముద్రం మీదుగా రెండు టన్నుల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు ఏడుగురు పాకిస్థాన్ జాతీయులకు ఈజిప్టు కోర్టు మరణశిక్ష విధించింది.2019 లో ఎర్ర సముద్రం మీదుగా అక్రమంగా రవాణా చేసిన సుమారు 2.5 బిలియన్ పౌండ్ల విలువైన మాదకద్రవ్యాలను ఈజిప్టు పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కోర్టు ప్రకటించింది. డ్రగ్ స్మగ్లింగ్ బాగోతంలో పాలుపంచుకున్న మరో ఇద్దరు ఈజిప్షియన్లు, ఒక ఇరానియన్ జాతీయుడికి కూడా మరణ దండనను ఈజిప్టు కోర్టు విధించింది. 100 కిలోల డ్రగ్స్ ను నౌకలో గుర్తించారు.ఈజిప్టు దేశంలో 2016వ సంవత్సరంలో 44 మందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 2017లో 35 మంది దోషులకు, 2018లో 43 మందికి మరణశిక్షలు అమలు చేశారు.


Updated Date - 2021-09-07T14:42:51+05:30 IST