ఎస్సై శిక్షణకు ఎనిమిది మంది ఎంపిక

ABN , First Publish Date - 2021-01-18T05:54:52+05:30 IST

ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎనిమిది మంది శిక్షణకు ఎంపికైనట్లు ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎస్సై శిక్షణ కోసం ఎంపికైన ఏఎస్సైలు శిక్షణకు ప్రత్యేక వాహనంలో బయలు దేరారు.

ఎస్సై శిక్షణకు ఎనిమిది మంది ఎంపిక

వేగవంతంగా పదోన్నతుల ప్రక్రియ : ఎస్పీ

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 17: ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎనిమిది మంది  శిక్షణకు ఎంపికైనట్లు ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎస్సై శిక్షణ కోసం ఎంపికైన ఏఎస్సైలు శిక్షణకు ప్రత్యేక వాహనంలో బయలు దేరారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై అన్వర్‌ ఉల్‌హాక్‌, ఆదిలాబాద్‌ పట్టణ ఎస్సై జి.అప్పారావుతో కలిసి పదోన్నతి కోసం ఎంపికైనా ఎనిమిది మంది ఏఎస్సైలను ఎస్పీ అభినందించారు. ఈనెల 18 నుంచి మూడు నెలల పాటు ఎస్సై శిక్షణ కొనసాగుతుందన్నారు. శిక్షణ చివరల్లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి వెంటనే ఖాళీలనుసారంగా ఎస్సై పదోన్నతి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కోసం బయలుదేరిన వారిలో ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న ఏఎస్సైలు మహ్మద్‌ ఆలీమ్‌(ఆదిలాబాద్‌ రూరల్‌), ఎన్‌.ముకుంద్‌రావ్‌(ఉట్నూర్‌), ఎండీ యూనిస్‌ (స్పెషల్‌ బ్రాంచ్‌ ఆదిలాబాద్‌), హారుణ్‌ఆలీఖాన్‌ (ఆదిలాబాద్‌ ట్రాఫిక్‌), అనిత ఆదిలాబాద్‌ (టూటౌన్‌), ముం తాజ్‌ అహ్మద్‌ (ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌), ఎం.రాములు (ఇచ్చోడ), దామన్‌ (గాదిగూడ) వారిలో ఉన్నారు. ఎంపికైన వారికి స్థానిక రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలతో సహ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విస్ణు ఎస్‌.వారియర్‌ మాట్లాడుతూ ఎస్సై పదోన్నతుల కోసం ఏఎస్సైలకు సీనియార్టి ప్రకారం అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణ ట్రైనింగ్‌ పూర్తి చేసి ఉత్తీర్ణులై జిల్లాకు చేరుకోవాలని ఆయన ఆకాక్షించారు. త్వరలో సివిల్‌ హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎస్సై పదోన్నతి కల్పించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పోలీసు స్టేషన్‌లో ఖాళీలను ఎప్పటికప్పుడు పదోన్నతులతో భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై అన్వర్‌ఉల్‌హాక్‌, ఒకటో పట్టణ ఎస్సై జి.అప్పారావ్‌, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్లు సుధాకర్‌రావు, వేణు, డా.సీఆర్‌.గంగారాం, పోలీసు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:54:52+05:30 IST