27న ఎలక్ట్రీషియన్‌ డే వేడుకలు

ABN , First Publish Date - 2022-01-24T06:34:45+05:30 IST

27న ఎలక్ట్రీషియన్‌ డే వేడుకలు

27న ఎలక్ట్రీషియన్‌ డే వేడుకలు

మాచవరం, జనవరి 23: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 27వ తేదీన ఎలక్ట్రీషియన్‌ డే వేడుకలను నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు, మండవ కుటుంబరావు, డి.వి. సత్యనారాయణ, కె.శ్రీహరిరావు తెలిపారు. ఆదివారం చుట్టుగుంటలోని ఏపీ ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌ డే కరపత్రాలను వారు ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఎలక్ట్రికల్‌ కార్మికులు వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. విశాఖపట్నం, తుని, విజయవాడ, జగ్గయ్యపేట, బాపట్ల, పలమనేరులో ఆల్వా ఎడిసన్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తామన్నారు. కె.బుజ్జి, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:34:45+05:30 IST