ఉద్యోగులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి విడనాడాలి

ABN , First Publish Date - 2021-12-07T04:56:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, వైఖరి మార్చుకుని తమ సమస్యలు పరిష్కరిం చాలని ఐదు జిల్లాల డిస్కం అధ్యక్షుడు భుక్యా నాగేశ్వర నాయక్‌ పేర్కొన్నారు.

ఉద్యోగులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి విడనాడాలి
ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వర నాయక్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 6: రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, వైఖరి మార్చుకుని తమ సమస్యలు పరిష్కరిం చాలని ఐదు జిల్లాల డిస్కం అధ్యక్షుడు భుక్యా నాగేశ్వర నాయక్‌ పేర్కొన్నారు. ఏపీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈఎస్‌జి కృష్ణం రాజు అధ్యక్షతన సోమవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. నాగేశ్వరనాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో ఉన్న 22వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, 4 విడతల డీఏ మంజూరుకు చర్యలు చేపట్టాలని, వేతన సవరణ కమిటి నివేదికను బహిర్గతం చేయాలని, ఈపీఎఫ్‌, జీపీఎఫ్‌ స్కీము అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎస్‌ శ్రీనివాసరావు, డిప్యూటి కార్యదర్శి బి నరసింహమూర్తి, తాడేపల్లిగూడెం డివిజన్‌ అధ్యక్షుడు ఎ బాలకృష్ణ, కార్యదర్శి కె ధనకొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T04:56:45+05:30 IST