శివగూడ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం

ABN , First Publish Date - 2021-02-25T05:38:40+05:30 IST

మండలంలోని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధి లో ఉన్న శివగూడ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు.

శివగూడ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో భవేష్‌ మిశ్రా

ఉట్నూర్‌, ఫిబ్రవరి 24: మండలంలోని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధి లో ఉన్న శివగూడ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు. మంగళవారం రాత్రి శివగూడలో గ్రామానికి విద్యుత్‌ సరఫరా ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గిరిజన గ్రామాలకు కరెంట్‌ లైన్‌ లు వేయించడం జరుగుతుందని అన్నారు. కరెంట్‌ లేకుండా  జీవిస్తున్న గిరిజనులకు విద్యుత్‌ వెలుగులు వచ్చాయని అన్నారు. గిరిజనుల కోసం ఐటీడీఏ ద్వారా ఆర్థిక  చేకూర్పు పథకం అమలు అవుతున్నందున అర్హులైన గిరిజను లు ఆన్‌లైన్‌ ద్వారా ఎంపీడీవోలకు దరఖాస్తులు సమర్పించుకోవాలని అన్నారు. ఇందులో ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం ఝాడే, ఈఈ రాజేశం, తదితరులున్నారు.

Updated Date - 2021-02-25T05:38:40+05:30 IST