Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసుల విధుల్లో నిబద్ధత అవసరం

పెదవేగి, నవంబరు 30: పోలీస్‌ విధుల్లో నిబద్దత ఎంతో ప్రధానమని డీఐజీ కేవీ.మోహనరావు అన్నారు.  ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణాజి ల్లా, విజయవాడ సిటీ పరిధిలోని ఎస్‌ఐ పదోన్నతికి 97మంది అభ్యర్థులకు మంగళవారం రెండోరోజు పరీక్ష నిర్వహించారు. యూనిఫామ్‌ టర్న్‌ ఔట్‌, ఆయుధాల నిర్వహణ, వివిధ రకాల పోలీస్‌ డ్రిల్‌, నేరస్థల పరిశీలన, నేరస్థలంలో సాక్ష్యాల సేకరణ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. నేరస్థులను అరెస్టు చేయడానికి అవసరమైన సాక్ష్యాల సేకరణలో సూక్ష్మ దృష్టి అవసరమని డీఐజీ చెప్పారు. రాత, మౌఖిక పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు.

Advertisement
Advertisement