ఉద్యోగులకు పూర్తి స్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-05-27T10:23:02+05:30 IST

ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్న ఉద్యోగవర్గాలకు పూర్థిస్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలని

ఉద్యోగులకు పూర్తి స్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల అర్బన్‌, మే 26: ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్న ఉద్యోగవర్గాలకు పూర్థిస్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.జాతీయ స్థాయిలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ వృత్తులు, ఉపాధి కూలీలు, దినసరి కూలీలకు కొంత మేరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థీక సాయం చేసేందుకు  సహకరిస్తున్నాయని అన్నారు. ప్రైవేట్‌ రంగంలో ఉపాధి పొందుతున్న వారందరీకీ కూడా యాజమాన్యాలతో పూర్తిస్థాయిలో వేతనాలు అందజేస్తున్నారు. ఈ పరిస్థాతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి పొందుతున్న వారందరికీ లాక్‌డౌన్‌ కాలానికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని పేర్కొంటూ , మరోవైపు ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర వర్గాల ఉద్యోగులకు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, ఉద్యోగులకు పాక్షికంగా వేతనాలు చెల్లించడం సరికాదన్నారు.


కేవలం వేతనంపై ఆధారపడే కుటంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ విద్యాసంత్సరం ఆరంభమయ్యే పరిస్థితుల్లో వెసులుబాటుకు జూన్‌ మాసారంభంలోనే వేతనం చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్‌ , ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరికీ వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించాలని , ఏప్రిల్‌, మే మాసాలకు సంబంఽధించిన పెండింగ్‌ బకాయిలు పూర్థిస్థాయిలో చెల్లించాలనీ సీఎం కేసీఆర్‌ కు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి లేఖ ద్వారా విన్నవించారు.

Updated Date - 2020-05-27T10:23:02+05:30 IST