హెల్మెట్స్ పెట్టుకుని మరీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. అసలు కారణం తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2021-11-16T21:39:34+05:30 IST

పై ఫొటోలో హెల్మెట్లు పెట్టుకుని ఉన్నవారు బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఉద్యోగులు..

హెల్మెట్స్ పెట్టుకుని మరీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. అసలు కారణం తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

పై ఫొటోలో హెల్మెట్లు పెట్టుకుని ఉన్నవారు బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఉద్యోగులు.. రోడ్డుపై బైక్‌ మీదు వెళుతున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటారో లేదో తెలియదు గానీ, హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రం కచ్చితంగా హెల్మెట్లు పెట్టుకుంటారు.. ఏ క్షణాన ఏ పెచ్చు ఊడి నెత్తి మీద పడుతుందో అనే భయమే దానికి కారణం.. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని దుర్గావతి ప్రైమరీ హెల్త్ సెంటర్‌ పరిస్థితి ఇది. 


40 ఏళ్ల క్రితం కట్టిన ఆ బిల్డింగ్ సీలింగ్ పెచ్చులు అప్పుడప్పుడు ఊడి పడుతున్నాయి. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ల్యాబ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మీద సీలింగ్ పెచ్చులు పడడంతో వారు గాయపడ్డారు. అప్పట్నుంచి అక్కడ పనిచేస్తున్న డాక్టర్ల నుంచి నర్సులు, ఇతర సిబ్బంది హెల్మెట్లు పెట్టుకునే విధులు నిర్వరిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి తమ పరిస్థితి ఇదేనని, పై అధికారులెవరూ తమ హాస్పిటల్‌ పరిస్థితిని బాగు చేసేందుకు ముందుకు రాలేదని అక్కడి ల్యాబ్ అసిస్టెంట్ చెప్పారు. పెచ్చులు ఊడి పడుతుండడంతో ల్యాబ్ పరికరాలు, కంప్యూటర్లు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. కాగా, త్వరలోనే కొత్త బిల్డింగ్ కడతామని పీహెచ్‌సీ ఇన్‌చార్జ్ తెలిపారు. 

Updated Date - 2021-11-16T21:39:34+05:30 IST