జోగినులందరికీ ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2020-08-13T10:34:07+05:30 IST

జోగినులు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌

జోగినులందరికీ ఉపాధి అవకాశాలు

ఈ దురాచారం మీతోనే అంతం కావాలి

ఎవరినైనా జోగినులుగా మారిస్తే కఠిన చర్యలు

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌


నారాయణపేట టౌన్‌/ ధన్వాడ/ ఉట్కూర్‌/ మక్తల్‌ టౌన్‌, ఆగస్టు 12 : జోగినులు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ అ న్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు, ధన్వాడ, మక్తల్‌, ఉట్కూరులలో బుధవారం ఆయన పర్యటించారు. జిల్లాలో జోగినుల స్థితిగతులను పరిశీలించారు. వారితో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ధన్వాడలో ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డితో కలిసి అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఊట్కూర్‌ శివారులోని దస్తన్న స మాది సమీపంలో సర్వేనెంబర్‌ 109లో జోగినులకు కేటాయిం చిన ఐదు ఎకరాల భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డితో కలిసి మొక్కలను నాటారు. జేవీపీఎస్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ హాజమ్మ ఆయనను కలిశారు.


ఆ భూమిలో ఎస్పీ కార్పొరేషన్‌ ద్వారా చిన్నతరహ పరిశ్రమలను ఏర్పాటు చేసి జోగినులకు ఉపాధి కల్పించాలని కోరారు. అందరూ కలిసి చర్చించుకొని దరఖాస్తు చేసుకుంటే పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని చైర్మన్‌ హామీ ఇచ్చారు. అనంతరం నారాయణపేట కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, కమిషన్‌ సభ్యుడు విద్యాసాగర్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన జోగినులతో మాట్లాడుతూ మీ పిల్లలందరినీ బాగా చదివించాలన్నారు.


ఎవరూ జోగినులుగా మారకూడదని, ఈ దురాచారం మీతోనే అంతం కావాలని సూచించారు. ఎవరినైనా జోగినులుగా, మాతం గులుగా మార్చితే ఆ గ్రామ సర్పంచ్‌, వీఆర్వో, తహసీల్దార్‌, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జోగినులకు, వారి పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో పది శాతం ఇళ్లను వారికి మంజూరు చేయాల న్నారు. జోగినుల పిల్లలకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో కేజీ టూ పీజీ విద్యను అందించే బాధ్యతను కలెక్టర్‌ తీసుకుం టారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. 


నరసింహులు కుటుంబానికి న్యాయం చేయాలి

పాలమూరు: రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌లో ఇసుక మాఫియా చేతిలో హత్యకు గురైన దళిత నరసింహులు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కావలి క్రిష్ణయ్య జిల్లా కేంద్రానికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కోరారు.


మాకు ఇళ్లు లేవ్‌ సార్‌...

‘సార్‌ తెలిసో తెలియకో మావోళ్లు మమ్మల్ని జోగినులుగా మార్చారు. బడుల్లో మా పిల్లలను తండ్రి పేరు అడిగితే మా కండ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.. కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇళ్లు లేవు, బ్యాంకుల్లో అప్పులు ఇవ్వడం లేదు’ అంటూ ధన్వా డకు చెందిన జోగినులు మనెమ్మ, నర్సమ్మతో పాటు పలువురు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో వాపో యారు. కేవలం ఆసరా పింఛన్‌తో సరిపెట్టుకుం టున్నామన్నారు. అంతకుముందు కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, ధన్వాడ సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి ఆయనకు పూలమొక్కలు ఇచ్చి స్వాగ తం పలికారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, ఆర్డీఓ శ్రీనివా సులు, ఏపీడీ సద్గుణ, తహసీల్దార్‌ తిరుపతయ్య, ఎంపీపీ పద్మిబాయి, జడ్పీటీసీ విమల అంజియాదవ్‌, మక్తల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌, సభ్యుడు సలెబిన్‌ సయ్యద్‌, ఓఎంఐఎఫ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఏంజిలా, సామా జిక కార్యకర్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.


అవినీతి అధికారులను శిక్షించాలి

పాలమూరు: ప్రభుత్వ భూమిని పట్టా చేసి ఇచ్చిన ల్యాండ్‌ అండ్‌ సర్వే, రికార్డు అధికా రులను సస్పెండ్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఈ విషయమై వినతి పత్రం ఇచ్చారు. భూత్పూర్‌ మండలం తాడిపత్రి గ్రామ శివారులో ఓ రియల్‌ వ్యాపారికి సర్వే నంబర్‌ 170/2లో 10 ఎకరాలా 14 గుంటలు భూమి ఉందని, అందులోంచి జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఎకరం భూమి తీసుకుని ప్రభుత్వం డబ్బు చెల్లించిందని తెలిపారు. అధికారులు రియల్‌ వ్యాపారులతో కుమ్మక్కై ఆ భూమి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కలిపి 10 ఎకరాలా 14 గుంటలకు డిమార్కెషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి రూ.లక్షల్లో అవినీతికి పాల్పడ్డారని వివరించారు. అవినీతి అధికారులను చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. 

Updated Date - 2020-08-13T10:34:07+05:30 IST