Abn logo
Jun 16 2021 @ 05:59AM

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

నౌగాం (జమ్మూకశ్మీర్): సెంట్రల్ కశ్మీరులోని శ్రీనగర్ శివార్లలోని నౌగం పట్టణ వాగురా ప్రాంతంలో మంగళవారం అర్దరాత్రి ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది చిక్కుకున్నారని భద్రతా బలగాలు చెప్పాయి. వాగురా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సీఆర్ పీఎఫ్ జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు. 

ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్ స్థలంలో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోకుండా జవాన్లు అన్ని దారులను మూసివేశారు. అర్దరాత్రి లైట్లు ఏర్పాటు చేసి అదనపు బలగాలను రప్పించారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది మరణించారని జవాన్లు చెప్పారు. బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ స్థలంలో కేంద్ర భద్రతా దళాలు గాలిస్తున్నాయి.