పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు
ABN , First Publish Date - 2021-03-09T17:14:55+05:30 IST
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ ఎమ్మెల్యేపై ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు....
న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ ఎమ్మెల్యేపై ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు.పంజాబ్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాకు చెందిన చంఢీఘడ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లోని నివాసాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు.మాదకద్రవ్యాల రవాణ, నకిలీ పాస్ పోర్టు కేసుల్లో ఈడీ అధికారులు ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ పై దాడులు చేసి దర్యాప్తు జరిపారు. సుఖ్ పాల్ సింగ్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు చెప్పారు.పంజాబ్ ఏక్తా పార్టీకి చెందిన ఖైరా 2017లో ఆప్ పార్టీ టికెట్టుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.