యుగపురుషుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T06:29:23+05:30 IST

తెలుగుజాతి కీర్తిపతాక నందమూరి తారక రామారావు యుగపురుషుడంటూ పలువురు టీడీపీ నాయకులు కీర్తించారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

యుగపురుషుడు ఎన్టీఆర్‌
తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్లో టీడీపీ నేతల పూజలు

చిత్తూరు, జనవరి 18:తెలుగుజాతి కీర్తిపతాక నందమూరి తారక రామారావు యుగపురుషుడంటూ పలువురు టీడీపీ నాయకులు కీర్తించారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు పాలాభిషేకాలు చేశారు. పేదసాదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. పేదలకోసం రూపాయికే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాల అమలుతో వారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. నేటి యువత ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.  




Updated Date - 2022-01-19T06:29:23+05:30 IST