ఉన్న భూమికి ఎసరు

ABN , First Publish Date - 2020-08-11T10:22:38+05:30 IST

ఉన్న భూమికి ఎసరు

ఉన్న భూమికి ఎసరు

బునాదిగాని కాల్వకు భూమి ఇచ్చిన రైతులు 

ఇచ్చిన భూమితో పాటు సర్వేనంబర్లనూ తొలగించిన వైనం

ఆగిన రైతుబంధు డబ్బులు, నమోదు కాని పంట సాగు వివరాలు 


మోత్కూరు, ఆగస్టు 10: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఆ రైతుల పరిస్థితి. తమతో పాటు చుట్టు పక్కల రైతులకూ ఉపయోగపడుతుందని కాల్వల తవ్వ కానికి భూములు ఇచ్చేందుకు ముందు కొచ్చారు. రైతుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకున్నప్పుడు రెవెన్యూ రికా ర్డుల్లో ఆ రైతు ఇచ్చిన భూమి సర్వేనంబర్‌లో కాల్వ కు తీసుకున్న భూ విస్తీర్ణాన్ని మాత్రమే తగ్గిస్తుంది. అందు కు భిన్నంగా మో త్కూరు మండలంలో బునా దిగాని (ధర్మారం)కాల్వకు భూమి ఇచ్చిన రైతుల సర్వే నంబ ర్లనే ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు.


కాల్వకు పోను మిగిలిన భూమి గల్లంతైంది. సర్వేనంబర్లలో కాల్వకు ఇచ్చిన భూమి పోను మిగిలిన భూమికి రైతుబం ధు కూడా అందలే దు. దీని తోడు అందులో సాగుచేసిన పంటల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. ఏమి చేయా లో ఆ రైతులకు పాలుపోని పరిస్థితి. మోత్కూరు మండ లంలోని పనకబండ, ఆరెగూడెం, మోత్కూ రు గ్రామాల్లో ని కొందరు రైతుల భూముల్లోంచి బునాదిగాని కాల్వ తవ్వారు. రెండేళ్ల క్రితం కాల్వకు భూమి కోల్పోయిన రైతులకు డబ్బులు (నష్టపరిహారం) చెల్లించారు. ప్రభు త్వం కాల్వకు తీసుకున్న భూ విస్తీర్ణాన్ని ఇటీవల రెవెన్యూ అధికారులు రైతుల భూ రికార్డుల్లో తగ్గించారు.అంతవరకు బాగానే ఉంది. జూన్‌ చివరి వారంలో రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బు లు ఇవ్వగా కాల్వకు భూమి ఇచ్చిన రైతులకు కాల్వకు పోగా మిగిలిన భూమికి రైతుబంధు రాలేదు.


ఓ రైతుకు ఒక్క సర్వే నంబర్‌లోనే భూమి ఉండి అందులోంచి కాల్వకు కొంత భూమి పోగా మిగిలిన భూమికి ఆ రైతుకు రైతుబంధు డబ్బుఅందలేదు. ఒక్క ఆరెగూడె ంలోనే 45మంది రైతు లు రూ.5లక్షలకు పైగా రైతుబం ధు సాయాన్ని నష్టపోయారు. ఆరెగూడెంలో గజ్జి శ్రీధర్‌కు 745 సర్వేనంబర్‌లో నాలుగు ఎకరాల 33 గుంటల భూమి ఉండగా, కాల్వకు 26గుంటల భూమి పోయింది. ఆ సర్వేనంబర్‌లో మిగిలిన నాలుగు ఎకరాల ఏడు గుంటల భూమికి రైతు బంధు డబ్బులు రాలేదు. వాపోయాడు. అదేవిధంగా పనకబండ గ్రామంలో 15మంది, మోత్కూరులో 25మం ది వరకు  బాధిత రైతులు ఉన్నారు. ఈ విషయమై రెవె న్యూ, వ్యవసాయ శాఖల అధికారులను అడిగితే తమకు తెలియదని సమాధానం దాటవేస్తున్నారని రైతులు ఆవేదన చెందు తున్నారు. సాగు చేసిన పంటల వివరాలు కూడా ఆన్‌ లైన్‌లో నమోదు కావడం లేదని, పండించిన పంటను ఎలా అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి కాల్వకు ఇచ్చిన భూమి మాత్రమే తగ్గించి ఆ సర్వే నంబర్‌లోని మిగతా భూమి ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఈ విషయమైన తహసీల్దార్‌ షేక్‌ అహమ్మద్‌ను వివరణ కోరగా కాల్వ తవ్వకానికి డబ్బు చెల్లించి ప్రభుత్వం తీసు కున్న భూమిని మాత్రమే రైతుల ఖాతాల్లో తగ్గించామని చెప్పారు. ఆ సర్వేనంబర్‌లో మిగతా భూమి ఉన్నదీ, లేనిదీ రైతులు 1బీ తీసి చూసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పాత డాటా తీసుకున్న ట్టున్నారని చెప్పారు. కాల్వకు భూమి ఇచ్చిన రైతులకు మిగతా భూమికి రైతుబంధు అందకపోవడం, ఇప్పుడు పంటల సాగు ఆన్‌లైన్‌ నమోదు కాక పోవడంపై ఏఈ వో టి.గోపీనాథ్‌ను అడగ్గా రైతులు కాల్వకు ఇచ్చినట్టు చెబుతున్న సర్వేనంబర్లలో మిగిలిన భూమి, సర్వే నంబర్‌గాని ఆన్‌లైన్‌లో కనుపించడం లేదని చెప్పారు. 


20 గుంటలు ఇస్తే రెండు ఎకరాలకు రైతుబంధు నిలిపి వేశారు:  కన్నెబోయిన పరమేష్‌, రైతు, ఆరెగూడెం

ఆరెగూడెంలో నాకు 815 సర్వేనంబర్‌లో 2ఎకరా ల 13గుంటల భూమి ఉంది. అందులోంచి 20 గుంటల భూమి బునాదిగాని కాల్వకు పోయింది. ఆ సర్వేనంబర్‌ లో మిగిలిన ఎకరం 33గుంట ల భూమికి రైతుబంధు రాలేదు. అందులో కంది పంట వేశాను. ఆ పంట కూడా ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. నాకు మిగతా సర్వేనంబర్లలో ఉన్న భూమికి రైతు బంధు వచ్చింది. లోపం ఎక్కడ జరిగిందో విచారించి న్యాయం చేయాలి. 

Updated Date - 2020-08-11T10:22:38+05:30 IST